హైద్రాబాద్‌ చేరుకున్న కల్వకుంట్ల కవిత

Published : Mar 22, 2023, 12:49 PM ISTUpdated : Mar 22, 2023, 01:06 PM IST
హైద్రాబాద్‌  చేరుకున్న కల్వకుంట్ల కవిత

సారాంశం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  ఇవాళ  ఉదయం  న్యూఢిల్లీ నుండి  హైద్రాబాద్  కు చేరుకున్నారు.  

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  బుధవారంనాడు  హైద్రాబాద్ కు  చేరుకున్నారు. ఈ నెల  19వ తేదీన కవిత  న్యూఢిల్లీకి వెళ్లారు.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఈడీ విచారణకు హాజరయ్యేందకు  కవిత ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే.   ఇవాళ  ఉదయం  న్యూఢిల్లీ నుండి  ప్రత్యేక విమానంలో  కవిత  బృందం  హైద్రాబాద్ కు  బయలుదేరింది.  న్యూఢిల్లీలోని  కేసీఆర్ అధికారిక నివాసం వద్ద  మీడియా ప్రతినిధులకు  ఉగాది శుభాకాంక్షలు తెలిపారు కవిత.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  మూడు దఫాలు కవిత  ఈడీ విచారణను ఎదుర్కొన్నారు.ఈ నెల  11,20, 21 తేదీల్లో  కవిత  ఈడీ విచారణకు  హాజరయ్యారు.  మరోసారి విచారణ  విషయ మై ఈడీ నుండి సమాచారం లేకపోవడంతో  కవిత  న్యూఢిల్లీ నుండి హైద్రాబాద్  కు చేరుకున్నారు. 

ఈ నెల  6వ తేదీన  అరుణ్   రామచంద్రపిళ్లైని  ఈడీ అధికారులు  అరెస్ట్  చేశారు. అరుణ్ రామచంద్ర పిళ్లై  ఇచ్చిన వాంగ్మూలం మేరకు  ఈడీ అధికారులు కవితకు    నోటీసులు ఇచ్చారు. ఈ నెల  8వ తేదీన కవితకు  ఈడీ అధికారులు నోటీసులు  జారీ చేశారు.ఈ నెల  9వ తేదీన  విచారణకు  రావాలని  కోరారు. అయితే  ముందుగా  ప్లాన్  చేసుకున్న కార్యక్రమాలు  ఉన్నందున విచారణకు  రాలేనని  కవిత ఈడీకి లేఖ  రాశారు. ఈ నెల  11న ఈడీ విచారణకు  కవిత  హాజరయ్యారు. ఈ నెల  16న  విచారణకు  రావాలని కవితకు ఈడీ అధికారులు  నోటీసులు  పంపారు. 

also read:న్యూఢిల్లీ నుండి హైద్రాబాద్ బయలుదేరిన కవిత

 అయితే  ఈ నెల  15న ఢిల్లీకి  చేరుకున్నప్పటికీ  ఈ నెల  16న ఈడీ విచారణకు  కవిత హాజరు కాలేదు.  ఈడీ అడిగిన సమాచారాన్ని కవిత  బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి  సోమా భరత్ ద్వారా పంపారు.  ఈడీ విచారణపై తాను  దాఖలు  చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈనెల  24న విచారించనున్నందున  అప్పటివరకు  విచారణకు  రాలేనని  కవిత  ఈడీకి  భరత్  ద్వారా లేఖ పంపారు. కానీ  ఈ నెల  20న విచారణకు  రావాలని  కవితకు  ఈడీ అధికారులు  నోటీసులు జారీ చేయడంతో  విచారణకు  కవిత  హాజరు కావాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. 

PREV
click me!

Recommended Stories

THROWBACK : అసెంబ్లీలో కేసీఆర్ Vs రేవంత్ రెడ్డి | KCR VS Revanth Reddy In Telangana Assembly
BIG BREAKING: మహిళా MLA అని కూడా చూడకుండా.. అసెంబ్లీ వద్ద తీవ్ర రచ్చ! 🚨