బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్‌పై దాడి .. 60 లక్షల మంది గులాబీ సైన్యం , తట్టుకోగలరా : కాంగ్రెస్ శ్రేణులపై కవిత ఫైర్

By Siva Kodati  |  First Published Nov 22, 2023, 8:13 PM IST

బోధన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్‌పై కాంగ్రెస్ శ్రేణుల దాడిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. ఓటమికి భయపడే బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ దాడులకు పాల్పడుతోందని.. గులాబీ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.


బోధన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్‌పై కాంగ్రెస్ శ్రేణుల దాడిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు అరాచకానికి, అభివృద్ధికి జరుగుతున్నవిగా అభివర్ణించారు. కాంగ్రెస్ నేతల దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని.. ఆ పార్టీ నిజ స్వరూపాన్ని ప్రజలు గమనించాలని కవిత కోరారు. బీఆర్ఎస్ పార్టీ ఐటీని జిల్లాలకు విస్తరిస్తే.. కాంగ్రెస్ మాత్రం అల్లర్లను విస్తరిస్తోందని ఆమె దుయ్యబట్టారు. 

అటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైనా కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను ప్రజలు రెడ్ డైరీలో రాసుకున్నారని.. గుండాయిజం, రౌడీయిజం చేసేవారికి ప్రజలు బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. బీసీల టికెట్లను అమ్ముకున్న రేవంత్ రెడ్డి.. వారి గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అంతర్గత గొడవలు జరుగుతున్నాయని.. అక్కడ అస్ధిర పాలన వుందని కవిత ఆరోపించారు. కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి తప్పారని ఆమె దుయ్యబట్టారు. మన బిడ్డలు డాక్టర్లు , సైంటిస్టులు కావాలా.. బీజేపీ, కాంగ్రెస్‌లు కోరినట్లుగా నక్సలైట్లు, పకోడీలు వేసుకునేవారు కావాలా అని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.

Latest Videos

undefined

ALso Read: Telangana Elections 2023: బీఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మ‌ధ్య‌ ఘర్షణ.. బోధన్ ఎమ్మెల్యే షకీల్‌కు గాయాలు

ఓటమికి భయపడే బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ దాడులకు పాల్పడుతోందని.. గులాబీ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 60 లక్షల గులాబీ సైన్యం ముందు మీరెంత.. బీఆర్ఎస్ శ్రేణులు ఈ దాడులను ప్రజాక్షేత్రంలోనే ఎదుర్కొంటాయని కవిత స్పష్టం చేశారు. షకీల్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. 

click me!