ఈడీ అరెస్ట్: సుప్రీంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్

By narsimha lodeFirst Published Mar 18, 2024, 9:20 AM IST
Highlights

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై కవిత  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

న్యూఢిల్లీ: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.  ఈ నెల  15వ తేదీన  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.ప్రతివాదిగా  ఈడీ అసిస్టెంట్ డైరెక్టరేట్ ను చేర్చారు.

also read:హృతిక్ రోషన్ పాటకు జంట డ్యాన్స్: సోషల్ మీడియాలో వైరల్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు గతంలో విచారించారు. అంతకుముందు సీబీఐ అధికారులు కూడ ఆమెను విచారించారు.  మహిళలను ఇంట్లోనే విచారించాలని కోరుతూ  సుప్రీంకోర్టులో  కవిత  పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ సాగుతుంది. ఈ తరుణంలోనే  ఈడీ అధికారులు కవితను  అరెస్ట్ చేశారు.  ఈ కేసులో అరెస్టైన  కవితను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. నిన్ననే కవితను తొలి రోజు విచారించారు. ఇవాళ రెండో రోజు విచారించనున్నారు.

also read:హైద్రాబాద్ మియాపూర్‌లో చెడ్డీగ్యాంగ్ కలకలం: స్కూల్లో రూ. 7.85 లక్షలు చోరీ

నిన్న తొలిరోజు  విచారణ పూర్తైన తర్వాత  కవితను హరీష్ రావు,  కేటీఆర్, భర్త అనిల్ కలిశారు. ఇదిలా ఉంటే  ఈడీ అధికారులు కవిత భర్త అనిల్ సహా మరికొందరికి కూడ నోటీసులు జారీ చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత  పాత్ర ఉందని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై రిమాండ్ రిపోర్టులో  ఈ విషయాన్ని ప్రస్తావించారు.   అయితే  ఈ ఆరోపణలను  కవిత కొట్టిపారేస్తున్నారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే తనను అరెస్ట్ చేశారని రిట్ పిటిషన్ లో పేర్కొన్నారు.

also read:కూరగాయల తరహలోనే నూడుల్స్ విక్రయం: సోషల్ మీడియాలో వైరలైన వీడియో

ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై  తనపై వచ్చిన ఆరోపణలను  కవిత తోసిపుచ్చారు. రాజకీయ కుట్రలో భాగంగానే  కవిత అరెస్ట్ జరిగిందని బీఆర్ఎస్ ఆరోపించింది.  ఈ విషయాన్ని  న్యాయపరంగా, రాజకీయపరంగా ఎదుర్కొంటామని ఆ పార్టీ ప్రకటించింది.  కవిత అరెస్టైన రోజునే ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే.

 


 

click me!