ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం జగిత్యాలలో నిర్వహించనున్న బహిరంగ సభలో మాట్లాడనున్నారు. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరనున్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ కప్‌ను రాయల్ చాలెంజర్స్ ఉమెన్ టీమ్ గెలుచుకుంది.
నేడు జగిత్యాలకు మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు జగిత్యాలలో పర్యటించనున్నారు. సోమవారం జగిత్యాల పట్టణానికి చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సభలో ప్రసంగించనున్నారు. ప్రధానమంత్రి సోమవారం ఉదయం 9 గంటలకు జగిత్యాలకు చేరుకుంటారు. పట్టణంలోని గీతా విద్యాలయంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతారు.
undefined
బీఆర్ఎస్‌లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన భావి అడుగుల గురించి ఓ విషయాన్ని వెల్లడించారు. తాను బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నట్టు స్పష్టం చేశారు. ఇందుకు ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు. సోమవారం రోజున అంటే ఈ నెల 18న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబి గూటికి చేరబోతున్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్వయంగా వెల్లడించారు.
వైసీపీ, కాంగ్రెస్‌లు ఒక్కటే: మోడీ
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, కాంగ్రెస్ లు రెండు ఒకటే అని, ఆ పార్టీలను ప్రజలు నమొద్దని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. ఆ రెండు పార్టీల్లో ఒకే కుటుంబం నుంచి వచ్చిన నాయకులు ఉన్నారని అన్నారు. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో ఆదివారం ఎన్డీఏ కూటమి నిర్వహించిన ‘ప్రజాగళం’ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు
జెండాలు వేరు కావొచ్చు మా ఎజెండా ఒక్కటే: చంద్రబాబు
తమ మూడు పార్టీల జెండాలు వేరైనా, ఎజెండాలు ఒకటే అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పల్నాడు జిల్లాలోని చిలకూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ప్రజాగళం సభ రాష్ట్ర పునర్నిర్మాణ భరోసా సభ అని అన్నారు. సంక్షేమం, అభివృద్దే ఎన్డీఏ కూటమి లక్ష్యం అని అన్నారు.
WPL 2024 నయా ఛాంపియన్ బెంగళూరు
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024) రెండో ఎడిషన్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త ఛాంపియన్ గా అవతరించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ తో రాణించి సూపర్ విక్టరీ సాధించింది.
ఎన్నికల బాండ్లతో బీజేపీకి అత్యధిక విరాళాలు
ఎన్నికల బాండ్ల రూపంలో అత్యధికంగా విరాళాలు పొందిన పార్టీ బీజేపీ. ఈ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో రూ. 6,986.5 కోట్లు అందాయి. బీజేపీ తర్వాత అత్యధిక విరాళాలు పొందిన పార్టీ టీఎంసీ (రూ. 1,397 కోట్లు), కాంగ్రెస్ (రూ. 1,334 కోట్లు), బీఆర్ఎస్ (రూ. 1,322 కోట్లు)గా ఉన్నాయి. అంటే.. ఎన్నికల బాండ్ల రూపంలో అత్యధికంగా విరాళాలు అందుకున్న నాలుగో పార్టీ భారత రాష్ట్ర సమితి.
కాంగ్రెస్‌లో చేరిన రంజిత్ రెడ్డి, దానం నాగేందర్
చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లు ఆదివారంనాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ సమక్షంలో వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
బీఆర్ఎస్ సీనియర్ నేత, వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. వరంగల్ ఎంపీ టిక్కెట్ ఆయనకు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.