కాంగ్రెస్ ట్రాప్‌లో పడొద్దు.. రేవంత్ ప్రభుత్వం వుంటుందా , వుండదా అంటే : కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Feb 1, 2024, 8:18 PM IST
Highlights

కాంగ్రెస్ ప్రభుత్వం వుంటుందా , వుండదా అంటే అది వారి చేతుల్లోనే వుందని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచి ఉద్దేశంతో సీఎంను కలిసినా క్యారెక్టర్‌ను బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుందని , కాంగ్రెస్ ట్రాప్‌లో పడొద్దని ఆయన హెచ్చరించారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పాటు ఫాంహౌస్‌లో జారిపడటంతో తుంటి ఎముకకు గాయమై ఇంటికే పరిమితమైన మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా రోజుల తర్వాత జనంలోకి వచ్చారు. గురువారం శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహరచనతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో అనుసురించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పదేళ్ల పాలన సాగించామన్నారు. బీఆర్ఎస్ మాత్రే తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుందని.. ఓటమితో నిరాశ, భయపడాల్సిన అవసరం లేదని చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వుంటుందని, ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్ధితి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వుంటుందా , వుండదా అంటే అది వారి చేతుల్లోనే వుందని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షపాత్రను సమర్ధవంతంగా నిర్వహిద్దామని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవాలనుకుంటే .. పార్టీకి సమాచారం ఇచ్చి కలవాలని కేసీఆర్ తెలిపారు. మంచి ఉద్దేశంతో సీఎంను కలిసినా క్యారెక్టర్‌ను బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుందని , కాంగ్రెస్ ట్రాప్‌లో పడొద్దని ఆయన హెచ్చరించారు. 

Latest Videos

నియోజకవర్గాల అభివృద్ధి కోసం మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వాలని, అది కూడా ప్రజల సమక్షంలోనే జరగాలని కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్ పార్టీకి తగిన సమయం ఇద్దామని, తొందర పడొద్దని .. ఆ పార్టీ నేతలు వాళ్లలే వాళ్లే తిట్టుకుంటారని చంద్రశేఖర్ రావు అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలంతా సిద్ధంగా వుండాలని , బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు నమ్మకం వుందని ఆయన పేర్కొన్నారు. 

 
 

click me!