కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తాగునీటి కష్టాలు: కేటీఆర్ సెటైర్లు

By narsimha lode  |  First Published Apr 3, 2024, 1:49 PM IST

ఏడాది పాటు  తాగునీటికి సరిపోను నాగార్జునసాగర్ లో నీళ్లున్నా  ఎందుకు  ఉపయోగించుకోవడం లేదని  కేటీఆర్  రేవంత్ రెడ్డి సర్కార్ ను ప్రశ్నించారు.
 


హైదరాబాద్:  తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ తాగునీటి కష్టాలు మొదలయ్యాయని  మాజీ మంత్రి కేటీఆర్  విమర్శించారు.బుధవారంనాడు హైద్రాబాద్ లో  కేటీఆర్  మీడియాతో మాట్లాడారు.  ప్రజలు గొంతు ఎండి ఇబ్బంది పడుతుంటే రేవంత్ రెడ్డి సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హైద్రాబాద్ లో మళ్లీ మంచినీటి కష్టాలు మొదలయ్యాయన్నారు.  తాము అధికారంలో ఉన్న సమయంలో  ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే వాళ్లమని కేటీఆర్ చెప్పారు. కానీ, రేవంత్ రెడ్డి మాత్రం  ఇతర పార్టీల నుండి  ఎమ్మెల్యేలు, నేతల చేరికపైనే దృష్టి పెట్టిందని ఆయన విమర్శించారు.

తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో  రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడ  మంచినీటి సమస్య ఎదురు కాలేదన్నారు. రూ.38వేల కోట్లతో మిషన్ భగీరథను చేపట్టి పూర్తి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 50 ఏళ్ల పాటు హైదరాబాదు నగరానికి తాగునీటి కొరత రాకుండా చేశామన్నారు. 

Latest Videos

undefined

తెలంగాణలో ప్రభుత్వం దిగిపోగానే హైదరాబాదులో ట్యాంకర్ల హడావిడి మొదలైందని ఆయన విమర్శించారు.రాష్ట్రంలో ఇన్వర్టర్లు, జనరేటర్లతో పాటు ట్యాంకర్ల దందా స్టార్ట్ అయిందన్నారు. ప్రకృతితో  వల్ల వచ్చిన తాగునీటి కొరత కాదన్నారు.గతంలో కురిసిన వర్షం కంటే 14% అధికంగా వర్షం ఉన్న తాగునీటి కొరత ఎందుకు వచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు.ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నా.... వాటిని నిర్వహించే తెలివి ప్రభుత్వానికి లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.  పార్టీ గేట్లు ఎత్తడం కాదు.. ప్రజల కోసం చేతనైతే ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలని కేటీఆర్ హితవు పలికారు.


ఫోన్ ట్యాపింగ్ కాదు.... వాటర్ ట్యాపింగ్ పై దృష్టి పెట్టాలని  ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు. సంవత్సరం పాటు నగర జనాభా అవసరాలకు అవసరమైన నీళ్లు నాగార్జునసాగర్ లో ఉన్నాయన్నారు.కేసీఆర్ మీద రాజకీయ కక్షతోని కాళేశ్వరంని విఫల ప్రాజెక్టుగా చూపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైతే మళ్లీ పంప్ హౌస్ లు ఎట్లా ప్రారంభమయ్యాయని ఆయన ప్రశ్నించారు.కాళేశ్వరంలో నీళ్లు ఉండి కూడా దాచి పెట్టడం వల్లనే లక్షల ఎకరాల పంట ఎండిందని కేటీఆర్ విమర్శించారుబెంగళూరు మాదిరి నీటిని వాడితే జరిమానాలు విధించే పరిస్థితి హైదరాబాద్ నగరంలో కూడా వస్తుందని కేటీఆర్ చెప్పారు. 

కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపులు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపండి.  హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చండి.అవసరమైతే జలమండలి ముందు ధర్నాలు చేస్తామన్నారు. 
హైదరాబాద్ తాగునీటి సరఫరాకు ఇబ్బందులు సృష్టించిన కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు..  రైతుల ఆత్మహత్యల వివరాలను రేవంత్ రెడ్డికి నేరుగా పంపిస్తామన్నారు.  తమ దగ్గర ఉన్న వివరాలు అన్ని అందిస్తామని ఆయన చెప్పారు.

ఫోన్ ట్యాపింగ్ తో తనకు  ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.  అడ్డగోలుగా మాట్లాడితే ముఖ్యమంత్రిని వదిలి పెట్టేది లేదన్నారు.చిత్తశుద్ధి ఉంటే 2004 నుంచి ఫోన్ టాపింగ్ వ్యవహారాల పైన విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ట్యాపింగ్ పైన అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టకుండా అడ్డగోలు ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుందని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

 

click me!