రైతుల‌కు మూడుపూటల క‌రెంట్ దండగ అంటున్న ఛోటా చంద్రబాబు: రేవంత్ రెడ్డి పై కేటీఆర్ ఫైర్

By Mahesh Rajamoni  |  First Published Jul 12, 2023, 10:41 AM IST

Hyderabad: రాష్ట్రంలో ఉచిత విద్యుత్ మూడు గంట‌లు చాలు అంటూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా మంగళ, బుధవారాల్లో ఆందోళనలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులను కోరింది. ఈ క్ర‌మంలోనే బీఆర్ఎస్ వ‌ర్కింట్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందిస్తూ రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 
 


Minister KTR fire on Revanth Reddy: రాష్ట్రంలో సాగుకు ఉచిత విద్యుత్ మూడు గంట‌లు చాలు అంటూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా మంగళ, బుధవారాల్లో ఆందోళనలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులను కోరింది. ఈ క్ర‌మంలోనే బీఆర్ఎస్ వ‌ర్కింట్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందిస్తూ రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ను వ్యతిరేకించినందుకు ప్రతి గ్రామంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని ఆయ‌న పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ యోచిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. రైతులకు కరెంటు ఇవ్వకుండా మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు. కాంగ్రెస్ తన రైతు వ్యతిరేక విధానాలను మరోసారి బహిర్గతం చేసిందని మండిప‌డ్డారు. తెలంగాణ రైతులు, ప్రజలు కాంగ్రెస్‌ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించాలని బీఆర్‌ఎస్‌ నేత అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అనవసరంగా 24 గంటల ఉచిత కరెంటు ఇస్తోందని ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ సమావేశంలో వ్యాఖ్యానించినట్లు సమాచారం. రైతులకు మూడు గంటల కరెంటు సరిపోతుందని చెప్పారు. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. 

Latest Videos

తాజాగా కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందిస్తూ.. రేవంత్ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. "కాంగ్రెస్ నోట..రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక.. !! అంటూ కాంగ్రెస్ వస్తే నిన్న ధరణి తీసేస్తం అన్నడు.. రాబందు నేడు 3 గంటల కరెంట్ చాలు అంటున్నడు.. నాడు వ్యవసాయం దండగ అన్నడు చంద్రబాబు.. నేడు మూడుపూటలు దండగ అంటున్నడు ఛోటా చంద్రబాబు అంటూ విమ‌ర్శ‌లు" గుప్పించారు. "మూడు ఎకరాల రైతుకు.. మూడుపూటలా కరెంట్ ఎందుకు అనడం ముమ్మాటికీ సన్న, చిన్నకారు రైతును అవమానించడమే. కాంగ్రెస్ కు ఎప్పుడూ చిన్నకారు రైతు అంటే చిన్నచూపు, సన్నకారు రైతు అంటే సవతిప్రేమ. నోట్లు తప్ప  రైతుల పాట్లు తెల్వని రాబందును నమ్మితే రైతు నోట్లో మట్టికొట్టుడు ఖాయం.. అన్నదాత నిండా మునుగుడు పక్కా.. అని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

అలాగే, "నాడు ఏడు గంటలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్.. నేడు ఉచిత కరెంట్ కు ఎగనామం పెట్టే కుట్ర చేస్తోంది. మూడుగంటలతో 3 ఎకరాల పొలం పారించాలంటే బక్కచిక్కిన రైతు బాహుబలి మోటార్లు పెట్టాలి. అరికాలిలో మెదడు ఉన్నోళ్లను నమ్ముకుంటే రైతుల బతుకు ఆగం.. మళ్లోసారి రాబందు 3 గంటల మాటెత్తితే రైతుల చేతిలో మాడు పగలడం ఖాయం.. తెలంగాణ రైతన్నలకు ఇది పరీక్షా సమయం..!! రైతును రాజును చేసే మనసున్న ముఖ్యమంత్రి KCR కావాలా ? 3 గంటలు చాలన్న మోసకారి రాబందు కావాలా ??"  అంటూ కేటీఆర్ తెలంగాణ ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించారు.

click me!