హైద్రాబాద్‌లో చైల్డ్ ఫోర్న్ వీడియోలు షేర్ చేస్తున్న ఎంసీఏ స్టూడెంట్‌: అదుపులోకి తీసుకున్న పోలీసులు

By narsimha lode  |  First Published Jul 12, 2023, 10:21 AM IST

చైల్డ్ ఫోర్నోగ్రఫీ వీడియోలను తరచుగా  ఫార్వర్డ్  చేస్తున్న  ఎంసీఏ  విద్యార్ధిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.


హైదరాబాద్:  చైల్డ్ ఫోర్న్ వీడియోలు ఫార్వర్డ్ చేస్తున్న ఎంసీఏ విద్యార్ధిని  బుధవారంనాడు హైద్రాబాద్ సీఐడీ  అధికారులు అరెస్ట్  చేశారు.

చైల్డ్ ఫోర్నోగ్రఫీ వీడియోలను తరచుగా  ఈ విద్యార్థి  ఫార్వర్డ్ చేస్తున్నట్టుగా అమెరికన్ ఏజెన్సీ గుర్తించింది.  ఈ విషయాన్ని ఇండియన్ ఎంబసీ ద్వారా  సమాచారం ఇచ్చింది.  ఇండియన్ ఎంబసీ ద్వారా సమాచారం అందుకున్న తెలంగాణ సీఐడీ అధికారులు  హైద్రాబాద్ అంబర్ పేటలో  ఉన్న ఎంసీఏ విద్యార్ధిని  అదుపులోకి తీసుకున్నారు.  చైల్డ్ ఫోర్నోగ్రఫీ వీడియోలను  ఎవరెవరికి  ఫార్వర్డ్  చేశారనే  విషయమై  ఆరా తీస్తున్నారు.  

Latest Videos

 


 

click me!