తెల్లారితే పెళ్లి... కరోనాతో వరుడు మృతి

Arun Kumar P   | Asianet News
Published : May 23, 2021, 08:20 AM ISTUpdated : May 23, 2021, 08:23 AM IST
తెల్లారితే పెళ్లి... కరోనాతో వరుడు మృతి

సారాంశం

పెళ్లికి ముందురోజే పెళ్లికొడుకు ఒక్కసారిగా అనారోగ్యానికి గురయి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పెళ్లిబాజాలు మొగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగుతోంది. 

హైదరాబాద్: మరికొద్దిగంటల్లో అతడి పెళ్లి. బంధువులు, స్నేహితులతో రాకతో ఆ ఇంట్లో పెళ్లిసందడి మొదలయ్యింది. ఇలాంటి ఆనంద సమయంలో పెళ్లికొడుకు ఒక్కసారిగా అనారోగ్యానికి గురయి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పెళ్లిబాజాలు మొగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగుతోంది. 

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్ గల్ గ్రామానికి చెందిన పవన్ కుమర్ సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇతడికి యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరుకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమయ్యింది. నిన్న(శనివారం) పెళ్లి కూడా జరగాల్సి వుంది. ఇంతలో దారుణం చోటుచేసుకుంది. 

read more  భార్య బాత్రూం వీడియో వైరల్... మనస్తాపంతో భర్త ఆత్మహత్య

శుక్రవారం పెళ్లికొడుకును చేసే సమయంలో పవన్ తీవ్ర అస్వస్ధతకు గురయ్యాడు. చలితో వణికిపోతున్న అతడిని కుటుంబసభ్యులు హాస్పిటల్ కు తరలించారు. అయితే మార్గమద్యలోని అతడు ప్రాణాలు విడిచాడు. 

పవన్ కుమార్ కరోనా బారినపడి వారంరోజుల క్రితమే కోలుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. వారం రోజులు హాస్పిటల్ లో చికిత్స పొందిన అతడు కోలుకోవడంతో పెళ్లి చేయాలని నిర్ణయించినట్లు... ఇంతలోనే ఈ దారుణం చోటుచేసుకుంది అంటూ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగానే పవన్ చనిపోయివుంటాడని అనుమానం వ్యక్తమవుతోంది. 


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!