వేడినీళ్లు, కడుపు నిండా భోజనం: 102 ఏళ్ల వయసులో కోవిడ్‌పై గెలిచిన వృద్ధుడు

By Siva Kodati  |  First Published May 22, 2021, 10:17 PM IST

కరీంనగర్ జిల్లా రాయికల్ పట్టణానికి గతంలో రెండుసార్లు ఏకగ్రీవ సర్పంచిగా చేసి ఒకసారి ఉప సర్పంచ్‌గా సేవలందించిన మహమ్మద్ జైనుద్దీన్ సాబ్ కరోనా నుంచి కోలుకున్నారు. ఆయన స్వతంత్ర సమరయోధుడిగా, రాజకీయ వేత్తగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సుపరిచితులు


ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దేశంలో ఎలాంటి ఉత్పాతాన్ని సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజుకు లక్షల్లో కేసులు, వేలాల్లో మరణాలతో ఇండియా వణికిపోతోంది. ముఖ్యంగా యువత, నడివయస్కుల వారిపై సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా వుంటోంది. వీరికి వ్యాక్సిన్ కూడా లేకపోవడంతో మరణాలు, కేసుల తీవ్రత అధికంగా వుంటోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. యువత వైరస్ బారినపడుతున్నారు. అలాంటిది ఏకంగా 102 ఏళ్ల వృద్ధుడు కోవిడ్‌ను జయించారు. 

వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా రాయికల్ పట్టణానికి గతంలో రెండుసార్లు ఏకగ్రీవ సర్పంచిగా చేసి ఒకసారి ఉప సర్పంచ్‌గా సేవలందించిన మహమ్మద్ జైనుద్దీన్ సాబ్ కరోనా నుంచి కోలుకున్నారు. ఆయన స్వతంత్ర సమరయోధుడిగా, రాజకీయ వేత్తగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సుపరిచితులు.

Latest Videos

undefined

Also Read:తెలంగాణ: పటిష్టంగా లాక్‌డౌన్.. అయినా 3 వేలకు పైనే కొత్త కేసులు

జైనుద్దీన్ సాబ్‌కు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు వున్నారు. ఆయన వయసు 102 సంవత్సరాలు. జైనుద్దీన్ సాబ్‌కు ఈ నెల ఒకటిన కరోనా వచ్చింది. అప్పటి నుంచి హోమ్ ఐసోలేషన్‌లోనే వుంటున్న జైనుద్దీన్ వైద్యులు ఇచ్చిన మందులను వాడుతూ కోలుకున్నారు.

దీనిలో భాగంగా మే 15న నెగిటివ్ రిపోర్టు రావడం విశేషం. నూట రెండు సంవత్సరాల వయసులో ఉండి మీరు కరోనాను జయించేందుకు ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నారు అని డాక్టర్లు ప్రశ్నించారు. వైద్యులు ఇచ్చిన మందులు వాడుతూ వేడినీళ్లు  కాషాయం లాంటివి వాడుతూ కడుపునిండా భోజనం చేస్తే సరిపోతుందని జైనుద్దీన్ తెలిపారు. 

click me!