
హైదరాబాద్ : ‘బంగ్లా అన్నావు.. ఇదేం ఇల్లు..’ అని అత్తగారింటికి వచ్చిన newly wedded bride భర్తపై రుసరుసలాడి అక్కడి నుంచి పరారయ్యింది. ఈ సంఘటన యాచారం మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామానికి చెందిన ఓ 40 యేళ్ల వ్యక్తి తనకు Marital relationship చూడాలని సమీప బంధువైన మంచాల మండలం లింగంపల్లికి చెందిన ఓ మధ్యవర్తిని కోరాడు.
అతను విజయవాడలో తనకు తెలిసిన వ్యక్తి ద్వారా పెళ్లి సంబంధం చూశాడు. విజయవాడకు చెందిన ఓ మహిళతో పెళ్లి కుదిర్చాడు. ఈ నెల 17న కుర్మిద్దకు చెందిన సదరు వ్యక్తితో సహ కుటుంబ సభ్యులు విజయవాడకు వెళ్లారు. అదేరోజు ఉదయం 11.40 గంలకు ఓ లాడ్జిలో వివాహం జరిగింది. అనంతరం నూతన దంపతులు, ఇరువురి కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి నేరుగా యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామిని దర్శంచుకున్నారు.
రాత్రి అక్కడే బస చేశారు. శనివారం తెల్లవారుజామున మధ్యవర్తి గ్రామమైన మంచాల మండలం లింగంపల్లికి వచ్చారు. అదే రాత్రి 9గంటలకు కుర్మిద్దకు చేరుకున్నారు. వచ్చీ రాగానే.. ‘పాత ఇల్లు చూసి.. బంగ్లా అన్నావ్.. ఇదేం ఇల్లు’ అని రుసరుసలాడింది. తనకు కడుపునొప్పి వస్తోంది టాబ్లెట్స్ తేవాలంటూ భర్తను బయటికి పంపించింది.
వధువుతో పాటు వచ్చిన మరో మహిళ ఇంటి బయటనే ఉండి అప్పటికే వేసిన పథకం ప్రకారం కారును తెప్పించుకుని క్షణాల్లోనే వెళ్లిపోయారు. కాగా, ఆ మహిళల నుంచి తాను మోసపోయానని మంగళవారం కుర్మిద్ద గ్రామానికి చెందిన వరుడు యాచారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే విషయం మీద సీఐ లింగయ్యను సంప్రదించగా.. తాను కోటీశ్వరుడినని, నగరంలో పెద్ద బంగ్లా ఉందని, తన పేరు మీద కుర్మిద్దలో పదెకరాల వ్యవసాయ పొలం ఉందని ఆ వ్యక్తి చెప్పి మాటలకు తామే మోసపోయానని వధువు చెప్పినట్లు సీఐ తెలిపారు.
బిర్యానీ ఆశ చూపించి.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం.. హైదరాబాద్ లో దారుణం..
ఇదిలా ఉండగా, రాంపూర్ గడ్డ సంగెం రేవు శివారులో ఈనెల 14న గుర్తు తెలియని వ్యక్తి dead body లభ్యమైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం వెల్లడించారు. మృతుడు nizamabad జిల్లా కోటగిరి మండలం జల్లాపల్లి ఫారానికి చెందిన కాశీనాథ్ (39)గా గుర్తించారు. ఆయన భార్య, తన భర్త కాశీనాథ్ ఈ నెల 8 నుంచి కనిపించడం లేదని బీర్కూర్ ఠాణాలో ఫిర్యాదు ఇచ్చిందని అన్నారు.
కేసును లోతుగా దర్యాప్తు చేయగా అతని భార్య నేనావత్ బుజ్జిబాయి మీద అనుమానం వ్యక్తం కావడంతో అదుపులోకి తీసుకుని విచారించినట్లు సీఐ తెలిపారు. భర్తను పథకం ప్రకారం హత్య చేసిందని ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. ఆమె తన మేనమామ కుమారుడు పెద్ద గుజ్జుల్ తండాకు చెందిన బానోత్ శ్రీనివాస్ కు దగ్గరై సంబంధం పెట్టుకున్నట్లు వెల్లడించారు.
శ్రీనివాస్ చిన్న కుమారుడు సురేష్ తో కాశీనాథ్ కు విందు ఇస్తామని చెప్పి.. మద్యం తాగించి.. కట్టెలతో కొట్టి చంపి.. మట్టిలో పాతి పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సంబంధం ఉన్న బుజ్జి బాయి, సురేష్ ను అరెస్టు చేసి మంగళవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ చెప్పారు. శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.