Breaking News : హైదరాబాద్ సిపి సందీప్ శాండిల్యకు తీవ్ర అస్వస్థత

సీపీ కార్యాలయంలో ఉండగానే సందీప్ శాండిల్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యారు. 

Google News Follow Us

హైదరాబాద్ :  హైదరాబాద్ సిపి సందీప్ శాండిల్యకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన కార్యాలయంలో ఉండగానే అస్వస్థత బారిన పడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయనను హుటాహుటిన  హైదర్ గూడా అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సీపీకి చికిత్స అందిస్తున్నారు. బషీర్ బాగ్ పాత సీపీ కార్యాలయంలో ఉండగా అస్వస్థతకు గురయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.