వేములవాడలో గాలి దుమారం బీభత్సం.. కూలిన బీఎస్పీ ప్రజా ఆశీర్వాద సభా ప్రాంగణం, టెంట్లు.. 15 మందికి గాయాలు..

By Asianet News  |  First Published Nov 20, 2023, 3:48 PM IST

వేములవాడలో బీఎస్పీ నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభ మధ్యలోనే ఆగిపోయింది. అనుకోకుండా వచ్చిన గాలి దుమారం ఆ సభా ప్రాంగణాన్ని నేలకూల్చింది. అలాగే టెంట్లు కూడా కూలిపోయాయి. దీంతో పలువురికి గాయాలు అయ్యాయి.


వేములవాడలో ఒక్క సారిగా వచ్చిన గాలి దుమారం బీభత్సం సృష్టించింది. దాని ప్రభావంతో ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభ మధ్యలోనే ఆగిపోయింది. ఆ కార్యక్రమం సభా వేదిక, టెంట్లు కూలిపోవడంతో 15 మందికి గాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

Shanti Dhariwal : మాకు డబ్బులొద్దు.. న్యాయం, గౌరవం కావాలి.. శాంతి ధరివాల్ కు మహిళల నుంచి వ్యతిరేకత

Latest Videos

వేములవాడ సిటీలోని బైపాస్ రోడ్డులో సోమవారం బహుజన సమాజ్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వేములవాడ, సిరిసిల్ల  బీఎస్పీ అభ్యర్థులు డాక్టర్ గోలి మోహన్, పిట్టల భుమేష్ తో పాటు కార్యకర్తలు హాజరయ్యారు.

విషాదం.. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సూసైడ్.. ఏం జరిగిందంటే ?

అయితే ఈ సభ కొనసాగుతున్న క్రమంలో ఒక్క సారిగా గాలి దుమారం వచ్చింది. దీంతో ఒక్క సారిగా ఈ కార్యక్రమం కోసం వేసిన టెంట్లు, సభా ప్రాంగణం కూలిపోయింది. ఆకస్మాత్తుగా జరిగిన ఈ ఘనటలో అక్కడున్న మహిళలు పరుగులు పెట్టారు. దీని వల్ల అక్కడున్న 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అక్కడ పోలీసులు అలెర్ట్ అయ్యారు. క్షతగాత్రులను పోలీసు వాహనాల్లో హాస్పిటల్ కు తరలించారు. అయితే అనుకోకుండా సంభవించిన ఈ ప్రమాదంతో ప్రజా ఆశీర్వాద సబ మధ్యలోనే ఆగిపోయింది. 

click me!