రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో అధునాతన టెక్నాలజీతో ఇండోర్ స్టేడియం నిర్మాణాన్ని చేపట్టారు. ఒకే పిల్లర్ పై కొత్త టెక్నాలజీ తో స్టేడియం నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా : తెలంగాణలోని మొయినాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ లోని కనకమాడిలో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం స్లాబ్ కూలిపోయింది. ఈ సమయంలో అక్కడ పనిచేస్తున్న కూలీలు ప్రమాదం బారిన పడ్డారు. ముగ్గురు మృతి చెందగా, పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. శిధిలాల కింద మరో 20 మంది చిక్కుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో అధునాతన టెక్నాలజీతో ఇండోర్ స్టేడియం నిర్మాణాన్ని చేపట్టారు.
ఈ స్టేడియం ప్రత్యేకత ఏమిటంటే కొత్త టెక్నాలజీ తో ఒకే పిల్లర్ పై స్టేడియం నిర్మించేందుకు కాంట్రాక్టర్ ప్రయత్నం చేస్తున్నారు. నిర్మాణం జరుగుతున్న సమయంలోనే ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కొన్ని సెకండ్ల ముందే స్లాబ్ కూలుతుందన్న అనుమానం రావడంతో కొంతమంది అక్కడి నుంచి బయటికి పరుగులు తీశారు. ఇంకొందరు అక్కడి నుంచి తప్పించుకునే లోపే ప్రమాదం ముంచుకొచ్చి మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తోంది.
Telangana Elections 2023 : ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ నోట ఎన్టీఆర్ నామస్మరణ...
ప్రమాద ఘటన తెలియడంతో ఘటన స్థలానికి వెంటనే స్థానిక అధికారులు, పోలీసులు చేరుకున్నారు. శిధిలాలను తొలగించి చిక్కుకుపోయిన కార్మికులను బయటికి తీయడానికి సహాయక చర్యలు ప్రారంభించారు. వీరితోపాటు ఇండియాలో సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొంటుంది.