హైదరాబాద్ లో విషాదం.. ఆల్కహాల్ సంపులో పడి బాలుడి మృతి...

By Bukka Sumabala  |  First Published Aug 20, 2022, 10:16 AM IST

హైదరాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలో కాపలాదారుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి కొడుకు ప్రమాదవశాత్తు ఆల్కహాల్ సంపులో పడిపోయాడు. దీంతో ఊపిరాడక మృతి చెందాడు. 


హైదరాబాద్ : ఓ పరిశ్రమలోని ఆల్కహాల్ సంపులో పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీడిమెట్ల ఎస్సై గౌతమ్ తెలిపిన వివరాల మేరకు.. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని రాజ్ కమల్ ల్యాబ్ లో బీహార్ కు చెందిన రామ్ కటుంబంతో కలిసి కాపలాదారుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 16న అతని కుమారుడు రాజ్ కుమార్ (3) ఆడుకుంటుండగా తల్లిదండ్రులు వారి పనుల్లో నిమగ్నమయ్యారు. కొంత సమయానికి చూస్తే కనిపించలేదు. సంస్థ ఆవరణలోని ఆల్కమాల్ సంపులో చూడగా రాజ్ కుమార్ కనిపించాడు. పైకి తీసి చూడగా అప్పటికే మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే నిరుడు జూన్ 27న హైదరాబాద్ లో జరిగింది. నీటి సంపులో పడి తల్లి, కుమారుడు మృతి చెందిన సంఘటన హైదరాబాద్, అమీన్ పూరలో జూన్ 27 రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హన్మకొండకు చెందిన దొడ్డా రాజేంద్రప్రసాద్ కు 2017లో సూర్యాపేటకు చెందిన శిరీష (30)తో వివాహం జరిగింది.  వీరికి రెండున్నరేళ్ల కుమారుడు కార్తికేయ ఉన్నాడు. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం కావడంతో గత కొంతకాలంగా చందానగర్ లో నివాసం ఉంటున్నారు. నెల రోజుల క్రితం అమీన్ పూర్ పట్టణంలోని సృజన లక్ష్మీ కాలనీకి నివాసం మార్చారు. 

Latest Videos

undefined

హైదరాబాద్ లో దారుణం... బిర్యానీ తిని మృతి చెందిన బాలుడు...

జూన్ 27 రాత్రి 9 గంటలకు కుమారుడు కార్తికేయ ఇంట్లో ఆడుకుంటూ బయటకు వెళ్లి నీటి సంపులో పడిపోయాడు. బాబు కనిపించకపోవడంతో భార్యభర్తలు బాబు కోసం వెతుకుతున్నారు. రాజేంద్రప్రసాద్ బైటికి వెళ్లి వెతుకుతుండగా, తల్లి శిరీష నీటి సంపులో పడిన బాబును కాపాడే క్రమంలో అందులో పడి మునిగిపోయింది. ఇంటికి వచ్చిన రాజేంద్రప్రసాద్ కు భార్య కూడా కనిపించకపోవడంతో సంపులో చూడగా భార్య శిరీష, కుమారుడు కార్తికేయ మృతదేహాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు, శిరీష తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాలను పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.
 

click me!