నేడు మునుగోడులో రేవంత్ పాదయాత్ర.. పాదాభివందనంతో వినూత్న రీతిలో ప్రచారానికి సిద్దమైన కాంగ్రెస్

Published : Aug 20, 2022, 10:16 AM ISTUpdated : Aug 20, 2022, 10:48 AM IST
నేడు మునుగోడులో రేవంత్ పాదయాత్ర.. పాదాభివందనంతో వినూత్న రీతిలో ప్రచారానికి సిద్దమైన కాంగ్రెస్

సారాంశం

మునుగోడు ఉప ఎన్నికపై అన్ని ప్రధాన పార్టీలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు.. మునుగోడు ఉప ఎన్నికను సెమీ ఫైనల్‌గా భావిస్తున్నాయి. దీంతో అక్కడ విజయమే లక్ష్యంగా ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి.

మునుగోడు ఉప ఎన్నికపై అన్ని ప్రధాన పార్టీలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు.. మునుగోడు ఉప ఎన్నికను సెమీ ఫైనల్‌గా భావిస్తున్నాయి. దీంతో అక్కడ విజయమే లక్ష్యంగా ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి. నేడు మునుగోడులో సీఎం కేసీఆర్ సభ జరగనుండగా.. రేపు బీజేపీ బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ హాజరుకానున్నారు. మరోవైపు మునుగోడు సిట్టింగ్ స్థానాన్ని  కాపాడుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే మునుగోడుపై మరింత దూకుడు పెంచింది. 

మన మునుగోడు మన కాంగ్రెస్ పేరుతో ముందుకు వెళ్తుంది. టీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేడు మునుగోడు నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నారు. ఒకే రోజు 5 మండలాల్లో పాదయాత్రకు రేవంత్ ప్లాన్ చేశారు. పాదాభివందనాలతో రేవంత్ జనం ముందుకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు నేడు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఇదిలా ఉంటే.. మునుగోడులో వినూత్నరీతిలో ప్రచారానికి కాంగ్రెస్ ప్రణాళికలు సిద్దం చేసింది. ఇంటింటికీ వెళ్లి లక్ష మంది పాధాబివందనం చేసి ఓటు అడగాలని చూస్తుంది. ఇందుకోసం రేవంత్ రెడ్డి వీరాభిమానులను రంగంలోకి దించనున్నారు. ఇందుకోసం స్పెషల్ టీమ్‌ను కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!