Boora Narsaiah Goud Biography: వృత్తిరీత్యా ఆయన వైద్యుడే, కానీ, తన చూట్టున్న వారి అభివృద్ధి కోసం ఏదైనా చేయాలని భావించే సామాజిక కార్యకర్త. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం పాల్గొన్న ఉద్యమకారుడు. చట్ట సభలో తెలంగాణవాదాన్ని వినిపించిన రాజకీయ నాయకుడు. ఆయనే డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. 2024 భారత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భువనగిరి లోక్ సభ సిగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బూర నర్సయ్య గౌడ్ వ్యక్తిగత, రాజకీయ చరిత్ర మీ కోసం..
Boora Narsaiah Goud Biography: వృత్తిరీత్యా ఆయన వైద్యుడే, కానీ, తన చూట్టున్న వారి అభివృద్ధి కోసం ఏదైనా చేయాలని భావించే సామాజిక కార్యకర్త. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం పాల్గొన్న ఉద్యమకారుడు. చట్ట సభలో తెలంగాణవాదాన్ని వినిపించిన రాజకీయ నాయకుడు. ఆయనే డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. 2024 భారత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భువనగిరి లోక్ సభ సిగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బూర నర్సయ్య గౌడ్ వ్యక్తిగత, రాజకీయ చరిత్ర మీ కోసం..
బాల్యం, విద్యాభ్యాసం
undefined
డాక్టర్ బూర నర్సయ్య గౌడ్.. 1959 మార్చి 2వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేటలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు బూర లక్ష్మయ్య రాజమ్మ. బూర నర్సయ్య ఇంటర్మీడియట్ వరకు సూర్యాపేటలో చదివారు. ఆ తర్వాత 1983లో హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో వైద్యవిద్యను పూర్తి చేశారు. అలాగే.. ఉస్మానియా మెడికల్ కాలేజీ నుండి జనరల్ సర్జరీలో ఎంఎస్ చేశారు. ఆ తరువాత లాపరోస్కోపిక్ సర్జరీలో స్పెషలైజేషన్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ లేప్రోస్కోపీ సర్జరీ (HILS) కి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన వైద్యుడు, రాజకీయ నాయకుడు, విద్యావేత్త, లాపరోస్కోపీ శిక్షకుడు, రచయిత,సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందారు.
డాక్టర్ గా..
ఆయన తన వైద్యవిద్యా పూర్తయిన తరువాత మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో 1987 నుండి 1990 వరకు అసిస్టెంట్ సివిల్ సర్జన్( లాపరోస్కోపిక్ సర్జరీ)గా సేవలందించారు. ఆ తరువాత 1991 నుండి 1995 వరకు ఉస్మానియా జనరల్ హాస్పిటల్, ఉస్మానియా మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీగా పనిచేశారు. PHCలో అరుదైన శస్త్ర చికిత్సలు చేసినందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి పలుమార్లు ప్రశంసలు అందుకున్నారు. భారతదేశంలో ల్యాప్రోస్కోపీ ట్రైనర్లలో ఆయన ఒకరు. ప్రాథమిక నుండి అధునాతన సాంకేతికను ఉపయోగించి 32,000 కంటే ఎక్కువ (లాపరోస్కోపిక్) సర్జరీలు చేసిన అనుభవం ఆయనకు ఉంది. సాధారణ శస్త్రచికిత్స, GI సర్జరీ, గైనక్ లాపరోస్కోపీ, థొరాకోస్కోపీ, క్యాన్సర్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, ఎండోక్రైన్ సర్జరీ, ఊబకాయం శస్త్రచికిత్సలలో అనుభవం, నైపుణ్యం కలిగిన డాక్టర్ ఆయన.
తెలంగాణ ఉద్యమ నాయకుడిగా
బూర నర్సయ్య వైద్యుడుగానే కాకుండా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఉద్యమకారుడిగా చూడవచ్చు. ఉద్యమంలో భాగంగా ఆయన DOTS అనే పేరిట తెలంగాణ రాష్ట్ర వైద్యులు సంఘాన్ని స్థాపించారు. రాస్తారోకో, మిలియన్ మార్చ్, సాగర హారం, రైల్ రోకో, అసెంబ్లీ ముత్తాడి వంటి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.ఉద్యమ సమయంలో ఆయన రెండుసార్లు అరెస్టు అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో గాయపడిన లేదా చికిత్స అవసరమైన అనేక మందికి వృత్తిపరమైన సహాయం అందించారు. ఉద్యమ సమయంలోనే ఆయన తెలంగాణ హెల్త్ బ్లూ ప్రింట్ రూపొందించారు.
రాజకీయ జీవితం
అప్పటివరకూ ఉద్యమనాయకుడిగా పనిచేసిన ఆయన 2013 జూన్ 2న టీఆర్ఎస్ లో చేరి ప్రత్యేక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆ తరువాత 2014 లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ నుండి పోటీ చేసి దాదాపు 30 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సమయంలో పలు స్టాండింగ్ కమిటీల్లో మెంబర్ గా పనిచేశారు. 2014 నుండి 2018 వరకు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పలు డెవలప్మెంట్ ప్రోగామ్స్ చేశారు. కానీ, 2019 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం పార్టీలో తలెత్తిన అంతర్గత కారణాల వల్ల 2022 అక్టోబర్ 15న టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.
బీజేపీలో చేరిక
గులాబీ పార్టీకి రాజీనామా చేసిన బూర నర్సయ్య గౌడ్ 2022 అక్టోబర్ 19న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలువురు కేంద్ర మంత్రులు సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. 2024 భారత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బిజెపి 2024 మార్చి 2న 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేయగా.. భువనగిరి లోక్సభ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్ పేరును అధిష్టానం ప్రకటించింది.
అవార్డులు
1989లో కేంద్ర ఆరోగ్య శాఖ నుండి ప్రత్యేక సర్జీకల్ నైపుణ్యం అవార్డు, 1990లో ఉత్తమ సర్జన్ అవార్డు, అలాగే వివిధ సంస్థల నుండి ఫెలోషిప్స్ పొందారు. ఫెలో ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్, సర్జన్స్ ఆఫ్ ఇండియా వంటి ఎన్నో ఫెలోషిప్స్ అందుకున్నారు. అపార జ్ఞానం ఆయన సొంతం.