కేసీఆర్ ఫ్యామిలీలో మరో అరెస్ట్.. కన్నారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు..

Published : Mar 23, 2024, 08:11 PM IST
కేసీఆర్ ఫ్యామిలీలో మరో అరెస్ట్.. కన్నారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు..

సారాంశం

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. భూ కబ్జా ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంలో మరో అరెస్ట్ జరిగింది. భూ కబ్జా చేశారన్న ఆరోపణలపై ఆయన అన్న కుమారుడు కన్నారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల గ్రామంలో రెండు ఎకరాల భూమిని కన్నారావు కబ్జా చేశారనే ఫిర్యాదు అందటంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

కేసీఆర్ అన్న కుమారుడితో పాటు మరో 38 మందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

AP & TElangana Rain Alert! వాతావరణశాఖ హెచ్చరిక రానున్న వారం రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఫ్రెండ్ భార్య‌తో వివాహేత‌ర సంబంధం, ఆపై హ‌త్య‌.. హంత‌కుడిని ప‌ట్టించిన బాల‌య్య ఫొటో. సినిమాను మించిన క్రైమ్ స్టోరీ