సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు కాల్ (Bomb threat call to Secunderabad railway station) వచ్చింది. దీంతో పోలీసులు (police), బాంబు డిస్పోజల్ అండ్ డిటెక్షన్ స్క్వాడ్ (Bomb Disposal and Detection Squad) అక్కడికి చేరుకొని తనిఖీలు నిర్వహించింది. ఈ విషయం తెలియడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు బాంబు కాల్ రావడం కలకలం రేకెత్తించింది. ఈ విషయం తెలియడంతో ప్రయాణికులు ఒక్క సారిగా ఆందోళనకు గురయ్యారు. రైల్వేస్టేషన్ లోని ఓ ప్రముఖ రెస్టారెంట్ లో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం సాయంత్రం ఫోన్ చేశారు. దీంతో ఆ స్టేషన్ పరిసరాలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాయి.
రామ్ లల్లా శిల కోసం నా భార్య తాళి తాకట్టు పెట్టా..- కాంట్రాక్టర్ శ్రీనివాస్
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. బాంబు డిస్పోజల్ అండ్ డిటెక్షన్ స్క్వాడ్ తో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్టేషన్ లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. బెదిరింపు కాల్ వచ్చిన రెస్టారెంట్ ను తాత్కాలికంగా మూసివేశారు. ప్రయాణికులను అందులోకి అనుమతించలేదు. అయితే పోలీసులకు, బాంబ్ స్క్వాడ్ కు అక్కడ అనుమానస్పదంగా ఏమీ కనిపించలేదు.
ఎన్డీయే కూటమిలోకి నితీష్ కుమార్ .. లాలూ ఏం చేయబోతున్నారు , దేనికైనా ఆర్జేడీ ఎమ్మెల్యేలు ‘‘ సై ’’ ..?
అర్థరాత్రి వరకు ఈ తనిఖీలు కొనసాగాయి. కొంత సమయం తరువాత అది ఫేక్ కాల్ అని తేలింది. అర్థరాత్రి సమయంలో అది ఫేక్ బెదిరింపు కాల్ అని పోలీసులు ప్రకటించి, కేసు నమోదు చేశారు. ఫేక్ కాల్ ఎవరు చేశారు ? ఎందుకు చేశారు ? ఎక్కడి నుంచి చేశారో గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.