Today's Top Stories: తెలంగాణలో కులగణన, కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం.. అంతుచిక్కని నితీష్ వ్యూహం..

By Rajesh Karampoori  |  First Published Jan 28, 2024, 6:52 AM IST

Today's Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం,  రేవంత్ సర్కార్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు,  త్వరలో తెలంగాణలో కులగణన, అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు ,కాళేశ్వరంపై నిపుణుల కమిటీ, రేషన్‌కార్డుదారులకు శుభవార్త.. మరోసారి ఈ-కేవైసీ గడువు పొడిగింపు, అంతుచిక్కని నితీష్ ప్లాన్.. రాజీనామా, ప్రమాణ స్వీకారం ఒకేరోజు, అభిమాన్యుడిని కాదు.. అర్జునుడిని అంటున్న జగన్ , రవిశాస్త్రి రికార్డును బ్రేక్ చేసిన హైదరాబాదీ..!, సరికొత్త చరిత్ర సృష్టించిన రోహన్ బోపన్న   వంటి వార్తల సమాహారం. 


Today's Top Stories:  

కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం.. ఎప్పుడంటే..

Latest Videos

KCR oath as MLA: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 1వ తేదీన ఆయన గజ్వేల్‌ ఎమ్మెల్యేగా (Gajwel MLA) ప్రమాణస్వీకారం చేయనున్నారు.  స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ సమక్షంలో ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణం చేయనున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత కేసీఆర్ తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కాలు జారీ కిందపడడంతో తుంటి ఎముకకు గాయం అయింది. దీంతో ఆయన తుంటి ఎముకకు వైద్యులు సర్జరీ చేయగా.. గత కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకున్నారు. దీంతో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయలేదు. తాజాగా ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. చేతి కర్ర సాయంతో అడుగులు చేస్తున్నారు.

 రేవంత్ సర్కార్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు  

KTR:తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు విమర్శలు గుప్పించారు. రాష్ట్ర మంత్రివర్గంలో మైనారిటీలకు ప్రాతినిధ్యం లేదని కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) సైద్ధాంతిక శక్తి అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) మూలాలున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని సంచలన ఆరోపణ చేశారు. శనివారం నాడు తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్ మైనారిటీ శాఖ సమావేశంలో కేటీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. 

త్వరలో తెలంగాణలో కులగణన ..  

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో రాష్ట్రంలో కులగణన చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కులగణన చేపడుతామని ఆ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇకపోతే.. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కూడా అక్కడి సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి కులగణనకు శ్రీకారం చుట్టారు. గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆధ్వర్యంలో కోటీ 60 లక్షల కుటుంబాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కులగణన చేయనుంది. రాష్ట్రంలో వున్న మొత్తం 723 కులాలను ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలుగా విభజించనున్నారు. జనవరి 19న ప్రారంభమైన ఈ సర్వే 28 వరకు జరగనుంది. 

అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు 

Amit Shah: గత అసెంబ్లీ ఎన్నికల ఓటమిని దృష్టిలో పెట్టుకున్న బీజేపీ అధిష్టానం..  లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికలకు సమర శంఖాన్ని పూరించాలని భావించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా  పార్టీ శ్రేణులలో జోష్ పెంచాలని బీజేపీ అగ్రనాయకత్వం భావించింది. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు తెలంగాణలో పర్యటించాలని షెడ్యూల్ ఫిక్స్ చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల కేంద్ర మంత్రి పర్యటన రద్దయింది. అయితే బీహార్ లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు చేయబడిందని భారతీయ జనతా పార్టీ వర్గాలు తెలిపాయి.  

కాళేశ్వరంపై నిపుణుల కమిటీ.. 

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నాణ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే.. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు కృష్ణా నదిపై జరిగిన నిర్మాణాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఇరిగేషన్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

రేషన్‌కార్డుదారులకు శుభవార్త.. మరోసారి ఈ-కేవైసీ గడువు పొడిగింపు..

Ration Card E-KYC: రేషన్‌కార్డు (Ration Card) లబ్ధిదారులకు శుభవార్త. రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తి చేసుకోని వారికి మరో అవకాశం కల్పిస్తూ.. తెలంగాణ సర్కార్ గడువును పొడిగించింది. ముందుగా నిర్ణయించిన గడువు ప్రకారం.. జనవరి 31వ తేదీతో అంటే.. ఈ నెల 31 తేదీతో రేషన్ కార్డు ఈ - కేవైసీ గడువు  ముగియనుంది. కానీ, గత రెండు నెలలుగా రేషన్ షాపుల్లో E-KYC అప్‌డేట్ చేస్తున్నా కొన్ని రేషన్‌ షాపుల దగ్గర భారీ లైన్లు దర్శనమిస్తూనే ఉన్నాయి. దీంతో ఫిబ్రవరి చివరి వరకు అంటే.. ఫిబ్రవరి 29వ తేదీ వరకు ఈ-కేవైసీ చేసుకొచ్చని తెలంగాణ పౌరసరఫరాల శాఖ పేర్కొంది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఓడిపోతానని జగన్‌కి అర్ధమైపోయింది: చంద్రబాబు నాయుడు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. శనివారం అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగిన రా కదలిరా బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉరవకొండలో టీడీపీ జనసేన గాలి వీస్తోందని, ఈ సభకు వచ్చిన జనాన్ని చూస్తే జగన్‌కు నిద్రపట్టదన్నారు. ఉమ్మడి అనంతలోని 14 సెగ్మెంట్లలోనూ టీడీపీ జనసేన కూటమిదే విజయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. హ్యాపీగా దిగిపోతానని జగన్ అంటున్నారంటే.. ఓటమి ఖాయమని తెలిసే ఆయన మాటల్లో తేడా వచ్చిందన్నారు. 

అభిమాన్యుడిని కాదు .. అర్జునుడిని : జగన్  

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖ జిల్లా భీమిలి నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు. సిద్ధం పేరుతో శనివారం జరిగిన భారీ బహిరంగసభలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తూ.. అటువైపు కౌరవ సైన్యం వుందని, వారి సైన్యంలో గజదొంగల ముఠా వుందన్నారు. కానీ ఇక్కడ వున్నది అభిమాన్యుడు కాదు.. అర్జునుడని సీఎం వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో సహా అందరినీ ఓడించాల్సిందేనని, ఈ అర్జునుడికి తోడుగా దేవుడితో పాటు ప్రజలు వున్నారని  జగన్ పేర్కొన్నారు. మీ అందరి అండదండలు వున్నంతకాలం తాను తొణకను బెణకనని వైసీపీ చీఫ్ అన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నెరవేర్చామని, 175కి 175 సీట్లు గెలుపే మన టార్గెట్ అని జగన్ స్పష్టం చేశారు. 

అంతుచిక్కని నితీష్ ప్లాన్.. రాజీనామా, ప్రమాణ స్వీకారం ఒకేరోజు  

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ మరోసారి ప్రమాణం చేయనున్నారు. ఆదివారం పాట్నాలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం జేడీఎల్పీ సమావేశం తర్వాత గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించనున్నాను నితీష్ కుమార్. బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ మరోసారి ప్రమాణం చేయనున్నారు. ఆదివారం పాట్నాలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డీయే కూటమిలో తిరిగి చేరుతున్న ఆయన .. స్పీకర్ పోస్ట్‌తో పాటు రెండు డిప్యూటీ సీఎం పదవులను బీజేపీకి ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆదివారం జేడీఎల్పీ సమావేశం తర్వాత గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించనున్నాను నితీష్ కుమార్. 

రవిశాస్త్రి రికార్డును బ్రేక్ చేసిన హైదరాబాదీ..!

Tanmay Agarwal: హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీని నమోదు చేశాడు. అగర్వాల్ హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 615/4డి భారీ స్కోరు నమోదు చేయ‌డంలో కీల‌క పాత్ర పోషంచాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని నెక్స్‌జెన్ క్రికెట్ గ్రౌండ్‌లో కేవలం 147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అగర్వాల్ త‌న ఇన్నింగ్స్ లో 181 బంతుల్లో 366 పరుగులు చేసి నబమ్ టెంపోల్ చేతిలో అవుట్ అయ్యాడు. అగర్వాల్ చేసిన 366 రంజీ ట్రోఫీ చరిత్రలో ఉమ్మడి నాలుగో అత్యధిక స్కోరు. దేశవాళీ గేమ్‌లో మొదటి రోజు ట్రిపుల్ సెంచరీ కొట్టిన ప్లేయ‌ర్ చ‌రిత్ర సృష్టించాడు.

సరికొత్త చరిత్ర సృష్టించిన రోహన్ బోపన్న 

Rohan Bopanna: ఆస్ట్రేలియన్ ఓపెన్ లో డబుల్స్ విజేతగా రోహన్ బోపన్న నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించారు. 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ విజేతగా నిలిచారు. దీంతో గ్రాండ్‌స్లామ్‌ గెలిచిన ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కుడైన  రికార్డు క్రియేట్ చేశారు.  43 ఏళ్ల వయసులో ఓ గ్లాండ్ స్లామ్ టోర్నీలో విజేతగా నిలవడం మామూలు విషయం కాదు. అద్బుత ప్రదర్శన ఇచ్చిన రోహన్ బోపన్నపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

click me!