భర్తతో గొడవపడిన అంధురాలు సోదరుడితో కలిసి కాలినడకన హైద్రాబాద్ నుండి నల్గొండకు బయలుదేరింది. జాతీయ రహదారిపై నడుచుకొంటూ వెళ్తున్న వారిని చూసిన పోలీసులు వారికి వాహనం ఏర్పాటు చేసి నల్గొండకు పంపారు.
హైదరాబాద్: భర్తతో గొడవపడిన అంధురాలు సోదరుడితో కలిసి కాలినడకన హైద్రాబాద్ నుండి నల్గొండకు బయలుదేరింది. జాతీయ రహదారిపై నడుచుకొంటూ వెళ్తున్న వారిని చూసిన పోలీసులు వారికి వాహనం ఏర్పాటు చేసి నల్గొండకు పంపారు.
నల్గొండ జిల్లా కేంద్రంలోని వాటర్ వర్క్స్ ఈఈ కార్యాలయంలో బుచ్చమ్మ అటెండర్ గా పనిచేస్తుంది. ఆమె అంధురాలు. ఉగాది పండుగ కోసం హయత్ నగర్ లో ఉండే తన భర్త, కొడుకు దగ్గరికి మానసిక వికలాంగుడైన తన సోదరుడు పరమేష్ తో కలిసి వెళ్లింది.
undefined
అయితే భర్త, పిల్లలతో కలిసి అక్కడే ఉంది. లాక్ డౌన్ కారణంగా ఆమె హయత్ నగర్ లోనే ఉంది. ఈ నెల 5వ తేదీన భర్త ప్రేమానందంతో గొడవపడింది. దీంతో మంగళవారం నాడు ఉదయం తన సోదరుడు పరమేష్ తో కలిసి నల్గొండకు బయలుదేరింది.
also read:తెలంగాణలో తెరుచుకున్న వైన్ షాపులు: చాంతాడులా క్యూలు
జాతీయ రహదారిపై సోదరుడి చేతులు పట్టుకొని నల్గొండకు కాలినడకన నడుచుకొంటూ బయలుదేరింది. అబ్దుల్లాపూర్ మెట్టు వద్దకు రాగానే పోలీసులు వారిని ఆపారు. నల్గొండకు వెళ్తున్నామని బుచ్చమ్మ పోలీసులకు చెప్పింది.
తిండి తిప్పలు లేకుండా కాలినడకన బయలుదేరిన విషయాన్ని పోలీసులు తెలుసుకొన్నారు. బుచ్చమ్మతో పాటు ఆమె సోదరుడికి భోజనం పెట్టారు. భోజనం చేసిన తర్వాత వారిని నల్గొండకు పంపేందుకు పోలీసులు వాహనాన్ని ఏర్పాటు చేశారు.