తెలంగాణలో మద్యం ధరలు పెంపు: పెంచిన రేట్లు ఇవీ..

By narsimha lodeFirst Published May 6, 2020, 10:14 AM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలను పెంచింది. పెంచిన ధరలు బుధవారం నుండి అమల్లోకి వచ్చాయి. తెలంగాణలో మద్యం దుకాణాలు ఇవాళ్టి నుండి ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ మంగళవారం నాడు ప్రకటించిన విషయం తెలిసిందే.
 


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలను పెంచింది. పెంచిన ధరలు బుధవారం నుండి అమల్లోకి వచ్చాయి. తెలంగాణలో మద్యం దుకాణాలు ఇవాళ్టి నుండి ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ మంగళవారం నాడు ప్రకటించిన విషయం తెలిసిందే.

కరోనా వ్యాప్తి  చెందకుండా లాక్ డౌన్ విధించడంతో దాదాపుగా 60 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలను మూసివేశారు. తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న నాలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు ఓపెన్ చేయడంతో తెలంగాణ రాష్ట్రంలో కూడ మద్యం దుకాణాలను తెరిచారు.మద్యం ధరలను 16 శాతం పెంచుతున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. చీప్ లిక్కర్ పై 11 శాతం మాత్రమే ధరలను పెంచుతామని సీఎం ప్రకటించారు.

also read:దారుణం:మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కొడుకు ముందే భార్యను చంపాడు

బీర్ పై 30 రూపాయాలు, చీప్ లిక్కర్ పుల్ బాటిల్ పై  రూ.40లు పెంచారు. ఆర్డినరీ లిక్కర్ పుల్ బాటిల్ పై రూ.80లు అదనంగా వసూలు చేయనున్నారు. స్కాచ్ లిక్కర్ పుల్ బాటిల్ పై రూ. 160 అదనంగా పెరిగాయి.తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయం తీసుకొంది.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలను తెరిచింది ప్రభుత్వం. రెడ్ జోన్లలో కూడ మద్యం దుకాణాలను ఓపెన్ చేసింది. హైద్రాబాద్ లోని కంటైన్మెంట్ జోన్లలో మాత్రమే మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వలేదు.

click me!