317 జీవోను నిరసిస్తూ డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్తున్న బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు నాంపల్లిలో అరెస్ట్ చేశారు. పార్టీ కార్యాలయం నుండి డీజీపీ కార్యాలయం వెళ్తున్న బీజేవైఎసం శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.
హైదరాబాద్: 317 జీవో కు వ్యతిరేకంగా డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్తున్న బీజేవైఎం కార్యకర్తలను సోమవారం నాడు నాంపల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు. 317 జీవోను సవరించాలని బీజేుపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న ఉపాధ్యాయుల బదిలీల విషయమై 317 జీవో బాధిత ఉపాధ్యాయుల డిమాండ్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లతో బీజేపీ అనుబంధ విభాగాల కార్యకర్తలు సోమవారం నాడు ఆందోళనలు నిర్వహించారు.
డీజీపీ కార్యాలయం ముట్టడించేందుకు వెళ్తున్న బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు నాంపల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసాన్ని బీజేపీ మైనార్టీ మోర్చా కార్యకర్తలు ముట్టడించారు.. ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. 317 జీవోను సవరించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.
also read:పంజాగుట్టలో కుటుంబ సభ్ములతో టీచర్ల నిరసన: అరెస్ట్ చేసిన పోలీసులు
భార్యాభర్తలను ఒకే జిల్లాకు బదిలీ చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. 317 జీవో ద్వారా ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులు కూడా ఆందోళనలు చేస్తున్నారు. రెండు రోజులుగా ఉపాధ్యాయులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే . శనివారం నాడు విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఉపాధ్యాయులు ధర్నాకు దిగారు. నిన్న పంజాగుట్ట వద్ద ఉపాధ్యాయుులు కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగారు.