బీఎల్ సంతోష్కు సిట్ నోటీసులపై స్టే ఆరువారాల పాటు పొడిగింపు..

Published : Jan 23, 2023, 03:12 PM IST
బీఎల్ సంతోష్కు సిట్ నోటీసులపై స్టే ఆరువారాల పాటు పొడిగింపు..

సారాంశం

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుకు సంబంధించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, తుషార్‌లకు సిట్ జారీ చేసిన సీఆర్‌పీసీ 41 నోటీసులపై హైకోర్టు స్టేను పొడిగించింది. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుకు సంబంధించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, తుషార్‌లకు సిట్ జారీ చేసిన సీఆర్‌పీసీ 41 నోటీసులపై హైకోర్టు స్టేను పొడిగించింది. బీఎల్ సంతోష్, తుషార్‌ల నోటీసులపై స్టే గడువు నేటితో ముగియనుండటంతో స్టే పొడగలించాలని సంతోష్ తరుపు న్యాయవాది కోర్టును కోరారు. మరోవైపు ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ప్రభుత్వ అప్పీల్ పిటిషన్ పెండింగ్‌లో ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానానికి తెలియజేశారు. విచారణ పూర్తి కావడానికి సమయం పట్టే అవకాశం ఉందని అన్నారు. దీంతో హైకోర్టు 41 నోటీసులపై స్టేను ఆరు వారాల వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది.

ఇక, ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ ఎన్‌ తుకారాంజీతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతుంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?