మునావర్ ఫరూఖీ షోకి అనుమతి వద్దు: డీజీపీకి బీజేవైఎం వినతి

Published : Aug 18, 2022, 04:31 PM IST
మునావర్ ఫరూఖీ షోకి అనుమతి వద్దు: డీజీపీకి బీజేవైఎం వినతి

సారాంశం

మునావర్ ఫరూఖీ ఈ నెల 20వ తేదీన నిర్వహించతలపెట్టిన  షో కి అనుమతివ్వవద్దని బీజేవైఎం నేతలు గురువారం నాడు కోరారు. ఈ మేరకు బీజేవైఎం నేతలు డీజీపీకి వినతి పత్రం సమర్పించారు.

హైదరాబాద్: మునావర్ ఫరూఖీ ఈ నెల 20వ తేదీన నిర్వహించతలపెట్టిన  'షో'కి అనుమతివ్వవద్దని బీజేవైఎం నేతలు గురువారం నాడు డీజీపీకి వినతి పత్రం సమర్పించారు.మునావర్ ఫరూఖీ షో ద్వారా హైద్రాబాద్ లో ఘర్షణ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని బీజేవైఎం నేతలు అనుమానం వ్యక్తం చేశారు.ఈ షో నిర్వహణకు అనుమతి ఇవ్వకూడదని కూడా కోరారు.

ఈ నెల 20వ తేదీన మునావర్ ఫరూఖీ షో ఏర్పాటు చేశారు.ఈ షో నిర్వహిస్తే అడ్డుకొంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇదివరకే వార్నింగ్ ఇచ్చారు.  ఈ షో ఎక్కడ నిర్వహిస్తున్నారో ఆ హాల్ ను కూడా దగ్దం చేస్తామని కూడా రాజాసింగ్ తేల్చి చెప్పారు. ఓ వర్గం దేవతలను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన మునావర్  కార్యక్రమాన్ని హైద్రాబాద్ లో నిర్వహిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని కూడా రాజాసింగ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. 

also read:ఈ నెల 20న హైద్రాబాద్ లో మునావర్ ఫరూఖీ షో: అడ్డుకొంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్

ఈ ఏడాది జనవరిలోనే మునావర్ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించారు. అయితే కరోనా కారణంగా కార్యక్రమం వాయిదా పడింది.  మునావర్ కార్యక్రమాన్ని ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్నారు.   మునావర్ హైద్రాబాద్ లో కార్యక్రమం నిర్వహించాలని మంత్రి కేటీఆర్ ఆహ్వానించడాన్ని కూడా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తప్పుబట్టిన విషయం తెలిసిందే.
 

PREV
click me!

Recommended Stories

Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu
Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu