మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారానికి సిద్దం, కానీ ఇలా చేయాలి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

By narsimha lodeFirst Published Aug 18, 2022, 3:16 PM IST
Highlights

మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో  ప్రచారానికి సిద్దమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. 

హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ప్రచారానికి సిద్దమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. అయితే ఈ విషయమై  తిరకాసు పెట్టారు.మునుగోడు ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా బాధ్యతలు అప్పగించాలని కోరారు. అలా చేస్తే తాను ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించారు. మునుగోడులో స్టార్ క్యాంపెయినర్ గా తనకు  బాధ్యతలు అప్పగిస్తే  ప్రచారానికి సిద్దమన్నారని  వెంకట్ రెడ్డి చెప్పారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ కథనం ప్రసారం చేసింది.

కాంగ్రెస్ పార్టీకి ఈ నెల 4వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. సోనియా గాంధీకి లేఖ పంపారు.ఈ నెల 8వ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను స్పీకర్ అదే రోజున ఆమోదించారు. దీంతో మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే మునుగోడు అసెంబ్లీ స్థానంలో పార్టీ కార్యక్రమాల విషయమై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

also read:నన్నుహోంగార్డుతో పోల్చారు, పార్టీ నుండి పంపే ప్రయత్నం: రేవంత్ పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్

ఈ నెల 5వ తేదీన చండూరులో నిర్వహించిన సభ విషయమై పార్టీ  నాయకత్వం  తనకు సమాచారం ఇవ్వలేదన్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహించే సభ గురించి తనకు సమాచారం ఇవ్వకపోవడంపై  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. 

కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ కాదు బ్రాందీ షాప్  అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఈ వ్యాఖ్యలు తనకు ఇబ్బంది కల్గించాయన్నారు. ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. అంతేకాదు క్షమాపణ చెప్పాలన్నారు.ఈ విషయమై రేవంత్ రెడ్డి తాను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినట్టుగా చెప్పారు. వెంకట్ రెడ్డి విషయంలో తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కూడా వివరణ ఇచ్చారు ఈ  వ్యాఖ్యల తర్వాత హోంగార్డు, ఐపీఎస్ వంటి వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి చేశారు.ఈ వ్యాఖ్యలపై  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పి మునుగోడులో ప్రచారానికి ఆహ్వానిస్తే ప్రచారానికి వస్తానని  ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే హోంగార్డు వ్యాఖ్యల విషయమై రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు. అంతేకాదు చండూరు సభలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్ క్షమాపణలు చెబుతూ  వీడియోను విడుదల చేశారు. 

మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఈ నెల 21న చౌటుప్పల్ లో జరిగే సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఈ ఎన్నికల్లో తన పట్టును నిలుపుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు ఇద్దరు చొప్పున ఇంచార్జీలను నియమించింది. మునుగోడులో ఇప్పటివరకు జరిగిన పార్టీ కార్యక్రమాల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరంగా ఉన్నారు. 

 


 

click me!