
రాజన్న సిరిసిల్ల జిల్లాలో (rajanna sircilla) బీజేవైఎం కార్యకర్త (bjym activist) ఓ మహిళ హోంగార్డు (lady home guard) చున్ని లాగిన ఘటన కలకలం రేపుతోంది. రుద్రంగి (rudrangi) మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రుద్రంగి మండల కేంద్రంలో లక్ష్మీ నరసింహ స్వామి జాతర సందర్భంగా విధులు నిర్వహించడానికి వచ్చిన ఓ మహిళ హోంగార్డు ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు. ఈ క్రమంలో మద్యం మత్తులో వచ్చిన కొందరు బీజేవైఎం, బీజేపీ కార్యకర్తలు మహిళా హోంగార్డు పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఆమె విధులకు ఆటంకం కలిగించడంమే కాకుండా హోంగార్డు చున్ని లాగి పారిపోయేందుకు యత్నించారు.
అయితే వెంటనే తేరుకున్న ఆమె పారిపోతున్న బీజేవైఎం కార్యకర్తను పట్టుకుని పోలీస్ అధికారులకు అప్పజెప్పింది. మరోవైపు లేడీ హోంగార్డు చున్నీ లాగిన బీజేవైఎం కార్యకర్తకు మద్దతుగా బీజేపీ, బీజేవైఎం నేతలు రుద్రంగి పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తడంతో పోలీసులు భారీగా మోహరించారు. లేడీ హోంగార్డు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బీజేవైఎం కార్యకర్తపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.