రాత్రి 7 గంటలకు కేసీఆర్ ప్రెస్‌మీట్ .. ధాన్యం కొనుగోళ్లు, ఎమ్మెల్సీ అభ్యర్ధులపై మాట్లాడే ఛాన్స్..?

Siva Kodati |  
Published : Nov 20, 2021, 05:28 PM ISTUpdated : Nov 20, 2021, 05:30 PM IST
రాత్రి 7 గంటలకు కేసీఆర్ ప్రెస్‌మీట్ .. ధాన్యం కొనుగోళ్లు, ఎమ్మెల్సీ అభ్యర్ధులపై మాట్లాడే ఛాన్స్..?

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి (telangana cm kcr) కేసీఆర్ శనివారం రాత్రి 7 గంటలకు ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) .. మూడు వ్యవసాయ చట్టాలను (farm laws) వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వీటిపై కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉన్నది.

తెలంగాణ ముఖ్యమంత్రి (telangana cm kcr) కేసీఆర్ శనివారం రాత్రి 7 గంటలకు ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడనున్నారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఈ నెల 18న ఇందిరాపార్క్‌లో ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యాసంగిలో (paddy) ధాన్యం కొంటారా? లేదా? అనే విషయాన్ని స్పష్టం చేయాలంటూ ఆయన రెండు రోజులు డెడ్‌లైన్‌ విధించిన విషయం తెలిసిందే. మరో వైపు ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) .. మూడు వ్యవసాయ చట్టాలను (farm laws) వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వీటిపై కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉన్నది. అలాగే హైదరాబాద్‌ మినహా తొమ్మిది ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులను (mlc elections) సైతం ఇదే సమావేశంలో కేసీఆర్ ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది.

కాగా.. వరి కొనుగోళ్లపై కేంద్రం ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఈ నెల 18 హైదరాబాద్ ఇందిరా పార్క్‌లో (Indira park)  టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన మహాధర్నాలో (TRS Maha Darna) సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుల గోస తెలంగాణలో కాదు.. దేశవ్యాప్తంగా రైతుల అందరికి ఉన్నారు. ఈ సభలో కూడా కేంద్రం సీఐడీలు ఉన్నారని.. తాను మాట్లాడే మాటలు పావు గంటలోనే మోదీ టేబుల్ చేరుతుందని అన్నారు. దేశంలో అద్భుతమైన శాస్త్రవేత్తలు ఉన్నారని అన్నారు. బంగారం పండే భూములను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతులను బతకనిస్తారా..? బతకనివ్వరా.. అని ప్రశ్నించారు.

ALso REad:KCR: అవసరమనుకుంటే భారత రైతాంగ సమస్యలపై టీఆర్‌ఎస్ లీడర్ షిప్ తీసుకుంటుంది.. కేంద్రంపై కేసీఆర్ ఫైర్

ఈ దేశాన్ని నడపడంలో ఇప్పటివరకు పాలించిన అన్ని పార్టీలు విఫలమయ్యాయని అన్నారు. భారత్ ఆకలి రాజ్యమని నివేదికలు సూచిస్తున్నాయి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 116 దేశాల్లో సర్వే చేస్తే భారత్ దేశం 101 స్థానంలో ఉంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ కన్నా భారత్ దీన స్థితిలో ఉంది.  కేంద్రం అనేక సమస్యలను పెండింగ్‌లో పెట్టిందని అన్నారు. కుల గణన చేయాలని తీర్మానం చేస్తే దానికి ఇంతవరకు దిక్కు లేదని అన్నారు. సమస్యలు పక్కకు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. కేంద్రం నీళ్లివ్వకుండా రాష్ట్రాల మధ్య తగాదాలు పెడుతుందని విమర్శించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు