గజం భూమీ పోకపోతే, ఆఫీసర్ల మీద వేటెందుకు ?

First Published Jun 14, 2017, 2:06 PM IST
Highlights

 పుప్పాలగూడలో గజం భూమి కూడా పోలేదని సిఎం  కెసిఆర్ మాట్లాడడం సిగ్గుచేటు. నిజంగా భూమి పోకపోతే  72 మంది అధికారులను ఎందుకు బదిలీ చేశారు?  తక్షణమే సిబిఐ  విచారణ జరిపించాలి.

భూముల కుంభకోణంలో తెలంగాణ సిఎం వైఖరిని ఖండించారు నాగం. భూముల వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కెకె కొనుగోలు చేసిన భూమి ప్రభుత్వానిదే అని నాగం స్పష్టం చేశారు. తక్షణమే కెకెపై చర్యలు  తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు కెకె మీద కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు.

 

మియాపూర్, ఇబ్రహింపట్నం  భూముల కుంభకోణంపై ఇప్పటికే టిడిపి  భారీస్థాయిలో ఆందోళన చేపట్టింది. గవర్నర్ నర్సింహ్మన్ కు ఫిర్యాదు చేసింది. రాష్ట్రపతికి  కూడా  ఫిర్యాదు చేయడం కోసం టిడిపి కసరత్తు చేస్తోంది. కలెక్టరేట్ల ను  ముట్టడించింది.

 

తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలోకి దిగింది. వివాదాస్పద భూముల విషయంలో పోరుబాట  పట్టింది. దీంతో  బిజెపి  సైతం రంగంలోకి దిగింది. ఆ పార్టీ సీనియర్ నేత నాగం  జనార్థన్  రెడ్డి  సిఎం కు లేఖ రాయంతో ప్రత్యక్ష కార్యాచరణకు బిజిపి దిగనుందని తెలుస్తోంది.

click me!