ఢిల్లీకి రేవంత్ రెడ్డి: కేబినెట్ విస్తరణ, నామినేటేడ్ పోస్టుల భర్తీపై అధిష్టానంతో చర్చలు

By narsimha lodeFirst Published Feb 19, 2024, 3:53 PM IST
Highlights


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు న్యూఢిల్లీ బాట పట్టారు.


హైదరాబాద్: నామినేటేడ్ పోస్టుల భర్తీ,  మంత్రివర్గ విస్తరణ, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై  పార్టీ అధిష్టానంతో చర్చించేందుకు గాను  తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి,  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు  సోమవారం నాడు హస్తిన బాట పట్టారు.  పార్టీ పెద్దలతో పాటు  పలువురు కేంద్ర మంత్రులను  కూడ  సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం  భట్టి విక్రమార్క కలిసే అవకాశం ఉంది.

2023 నవంబర్  మాసంలో జరిగిన ఎన్నికల్లో  తెలంగాణ రాష్ట్రంలో  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే  రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. త్వరలోనే  పార్లమెంట్ ఎన్నికలు కూడ రానున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుండి మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహలు రచిస్తుంది.  ఈ క్రమంలోనే  ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు  కార్యాచరణను సిద్దం  చేస్తుంది.  

కేబినెట్ లో కొన్ని జిల్లాలకు ప్రాతినిథ్యం లేదు. హైద్రాబాద్, నిజామాబాద్,  ఆదిలాబాద్ వంటి జిల్లాలకు  ప్రాతినిథ్యం లేదు. దీంతో   ఈ జిల్లాల నుండి  కేబినెట్ లో ప్రాతినిథ్యం కల్పించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కేబినెట్ లో ఎవరికి ప్రాధాన్యత కల్పించాలనే దానిపై  పార్టీ నాయకత్వంతో  రేవంత్ రెడ్డి  చర్చించే అవకాశం ఉంది. మరో వైపు నామినేటేడ్ పోస్టుల భర్తీ, ఖాళీగా ఉన్న కార్పోరేషన్ల చైర్మెన్ల నియామకంపై  పార్టీ అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు.

also read:ఆంధ్రప్రదేశ్‌లో రేవంత్ ప్రచారం: తిరుపతి సభకు తెలంగాణ సీఎం

మరో వైపు  పార్లమెంట్ ఎన్నికలపై కూడ  కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలోని  17 ఎంపీ స్థానాల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలనే వ్యూహంతో ఆ పార్టీ వ్యూహలు రచిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం  మూడు వందలకు పైగా ధరఖాస్తులు అందాయి.   ఈ ధరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి  అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ నాయకత్వం  కేంద్రీకరించింది.  పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం  ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీతో  సమావేశంలో పాల్గొనేందుకు గాను  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీ బయలుదేరారు. వీరిద్దరితో పాటు  తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహరాల మంత్రి శ్రీధర్ బాబు కూడ ఉన్నారు.

 

click me!