పెంబర్తి వద్ద బండి సంజయ్ ను తరలిస్తున్న కాన్వాయ్ అడ్డగింత: ఉద్రిక్తత

By narsimha lode  |  First Published Apr 5, 2023, 11:56 AM IST

బండి సంజయ్ ను  తరలిస్తున్న కాన్వాయ్ ను బీజేపీ శ్రేణులు  అడ్డుకొనే ప్రయత్నం  చేశాయి.  పోలీసులు బీజేపీ శ్రేణులను చెదరగొట్టి  హన్మకొండ వైపు   బండి సంజయ్ ను తరలించారు.  


హన్మకొండ: బీజేపీ తెలంగాణ  రాష్ట్ర అధ్యక్షుడు బంండి సంజయ్ ను తరలిస్తున్న  కాన్వాయ్ ను   ఉమ్మడి వరంగల్ జిల్లా పెంబర్తి వద్ద  బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం  చేశాయి. బీజేపీ శ్రేణులను  పోలీసులు  చెదరగొట్టారు.  పోలీసులతో  బీజేపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు . ఇరువర్గాల మధ్య తోపులాట చోటు  చేసుకుంది. దీంతో పెంబర్తి వద్ద  ఉద్రిక్తత నెలకొంది.  టెన్త్ క్లాస్  హిందీ పేపర్  లీక్ అంశానికి సంబంధించి  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై  పోలీసులు  కుట్ర కేసు నమోదు  చేశారు.  నిన్న  కరీంనగర్ నుండి  పోలీసులు బండి సంజయ్  ను యాదాద్రి జిల్లాలోని  బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

also read:బండి సంజయ్ ఆదేశాలతోనే పేపర్ లీక్: పల్లా రాజేశ్వర్ రెడ్డి
టెన్త్ క్లాస్  హిందీ పేపర్ లీక్  అయిందని సోషల్ మీడియాలో  ప్రచారం వైరల్ గా మారింది.  ప్రశాంత్  అనే  వ్యక్తి  బండి సంజయ్  కు  వాట్సాప్ లో  ఈ పేపర్ ను షేర్ చేశారు పేపర్ లీక్ విషయమై  బండి సంజయ్ పై   పోలీసులు కేసు నమోదు  చేశారు. నిన్న రాత్రి  కరీంనగర్ లో  ఉన్న బండి సంజయ్  ను పోలీసులు  అరెస్ట్  చేశారు. నిన్న  రాత్రి కరీంనగర్ నుండి యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు రతరలించారు.

Latest Videos

ఇవాళ  ఉదయం   బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ నుండి  ఉమ్మడి వరంగల్ జిల్లాకు  బండి సంజయ్  కు తరలించారు . బండి సంజయ్  అరెస్ట్ పై  బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి.  పరీక్షల నిర్వహణలో  ప్రభుత్వ చేతకానితనం  బయటపడిందని  బీజేపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి.  

బండి సంజయ్ అరెస్ట్  విషయమై  బీజేపీ కేంద్ర నాయకత్వం  ఆరా తీసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ విషయమై  మాజీ ఎమ్మెల్సీ  రామచంద్రరావుతో   నడ్డా ఫోనులో మాట్లాడారు. 
 

click me!