ఏళ్ల తరబడి పోరాటం ఫలించి శ్రీరామ జన్మభూమి అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణం పూర్తయి త్వరలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది. ఆ రోజు జరిగే కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని ఇంకొందరు ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి బీజేపీ శుభవార్త చెప్పింది. తెలంగాణ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లను నడపాలని ఆ పార్టీ యోచిస్తోంది.
ఏళ్ల తరబడి పోరాటం ఫలించి శ్రీరామ జన్మభూమి అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణం పూర్తయి త్వరలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది. దీంతో రాములోరిని దర్శించుకోవాలని భక్తులు తహతహలాడిపోతున్నారు. ఆ రోజు జరిగే కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని ఇంకొందరు ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి బీజేపీ శుభవార్త చెప్పింది. తెలంగాణ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లను నడపాలని ఆ పార్టీ యోచిస్తోంది.
ప్రతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఒక రైలును నడపున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి షెడ్యూల్ ఖరారు కానుంది. జనవరి 22 తర్వాత తెలంగాణ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు.. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ దేశవ్యాప్తంగా అయోధ్యకు 1000 రైళ్లను నడపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 19 నుంచే ఈ రైళ్లు అందుబాటులో వుంటాయని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ALso Read: అయోధ్యలో అడుగడునా టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్లు, చలిమంటలు, మొబైల్ టవర్లు..
ఇకపోతే.. యోధ్యలో శ్రీరామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన బ్లూప్రింట్ కూడా సిద్ధమైంది. సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్‌తో పాటు రాష్ట్ర పోలీసు బలగాలను ప్రతి వీధిలో మోహరిస్తారు. అయోధ్యలో ఇప్పటికే భద్రతా కోణంలో చాలా సున్నితంగా ఉందని ఐజీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. భద్రతా ఏర్పాట్లకు సరిపడా పోలీసులు ఉన్నారు. వీటిలో సీఆర్పీఎఫ్, యూపీఎస్ఎస్ఎఫ్, పీఎస్సీ, పౌర పోలీసు బలగాలు ఉన్నాయి.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తరపున రామమందిర ప్రాణ ప్రతిష్ఠా వేడుకలకు వచ్చేవారి కోసం కరసేవకపురం, మణిరామ్ దాస్ కంటోన్మెంట్, బాగ్ బిజేసీలాంటి 3 ప్రదేశాలలో బస ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మరోవైపు, బ్రహ్మకుండ్ గురుద్వారా, సరయూ బీచ్, గుప్తర్ ఘాట్ లాంటి మరో మూడు ప్రదేశాలలో స్థానిక పరిపాలన ద్వారా డేరా నగరాలను కూడా నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి మునిసిపల్ కమీషనర్ విశాల్ సింగ్ మాట్లాడుతూ, రాంలల్లా ప్రాణప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని, బ్రహ్మకుండ్ గురుద్వారా సమీపంలో టెంట్ సిటీని నిర్మించామని తెలిపారు.
జ్యోతిష్యులు, వేద అర్చకులతో సంప్రదింపుల తర్వాత శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనవరి 22 న మధ్యాహ్నం 12 నుండి 12.45 గంటల మధ్య రామాలయంలోని గర్భగుడిలో రామ్ లాలాను ప్రతిష్టించాలని నిర్ణయించింది. శంకుస్థాపన (పవిత్ర) కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొంటారు.
అలాగే.. యూపీ సీఎం యోగి, గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ కూడా హాజరుకానున్నారు. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. ప్రోటోకాల్ ప్రకారం (ప్రధానమంత్రి సమక్షంలో) కార్యక్రమానికి గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరవుతారని తెలిపారు. ప్రధాని వెళ్లిన తర్వాతే ఆహ్వానితులకు రామ్ లల్లా దర్శనం లభిస్తుందని ఆయన అన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. ట్రస్ట్ అన్ని వర్గాలకు చెందిన 4,000 మంది సాధువులను రామ్‌లల్లా పట్టాభిషేక కార్యక్రమానికి ఆహ్వానించింది.