కరీంనగర్‌లో దీక్షకు దిగిన బండి సంజయ్: అమిత్ షా ఫోన్

Published : Oct 26, 2020, 10:11 PM ISTUpdated : Oct 26, 2020, 10:55 PM IST
కరీంనగర్‌లో దీక్షకు దిగిన బండి సంజయ్: అమిత్ షా ఫోన్

సారాంశం

సిద్దిపేటలో పోలీసుల వైఖరిని నిరసిస్తూ కరీంనగర్ లోని తన కార్యాలయంలో ఎంపీ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం నాడు రాత్రి దీక్షకు దిగాడు.

కరీంనగర్: సిద్దిపేటలో పోలీసుల వైఖరిని నిరసిస్తూ కరీంనగర్ లోని తన కార్యాలయంలో ఎంపీ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం నాడు రాత్రి దీక్షకు దిగాడు.

సిద్దిపేటకు వెళ్లకుండా బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసి కరీంనగర్ కు తరలించారు. దీంతో కరీంనగర్ లోని తన కార్యాలయంలోనే బండి సంజయ్ స్వీయ నిర్భంధంలోకి వెళ్లాడు. 

ఈ విషయం తెలుసుకొన్న బీజేపీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున ఎంపీ కార్యాలయం వద్దకు చేరుకొన్నారు. దుబ్బాకలో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో సోమవారం నాడు సోదాలు నిర్వహించారు.

also read:దుబ్బాక నుండే టీఆర్ఎస్ కు రాజకీయ సమాధి: బండి సంజయ్

సిద్దిపేటలోని అంజన్ రావు ఇంట్లో పోలీసులు రూ. 18 లక్షలు స్వాధీనం చేసుకొన్నారు. ఈ సమయంలో సుమారు రూ. 5 లక్షలను బీజేపీ కార్యకర్తలు తీసుకెళ్లినట్టుగా సిద్దిపేట సీపీ ప్రకటించారు.

బండి సంజయ్ కు అమిత్ షా ఫోన్

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం నాడు ఫోన్ చేశారు. సిద్దిపేటలో చోటు చేసుకొన్న పరిణామాలపై ఆయన ఆరా తీశారు. జరిగిన విషయాన్ని ఎంపీ మంత్రికి వివరించారు. 

PREV
click me!

Recommended Stories

తెలుగోళ్లకు మాత్రమే ఈ ఆఫర్.. SBI లో అకౌంట్ ఉంటే చాలు కోటి రూపాయలు
కేసీఆర్ దగ్గరకెళ్లి మరీ దండంపెట్టిన రేవంత్.. KTR Reaction | Revanth Respect | Asianet News Telugu