బండి సంజయ్ అరెస్ట్... పోలీసులపై పవన్ కల్యాణ్ ఫైర్

Arun Kumar P   | Asianet News
Published : Oct 26, 2020, 09:58 PM ISTUpdated : Oct 26, 2020, 10:24 PM IST
బండి సంజయ్ అరెస్ట్... పోలీసులపై పవన్ కల్యాణ్ ఫైర్

సారాంశం

తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ అరెస్ట్ పై పవన్ కల్యాణ్ స్పందించారు.  

హైదరాబాద్: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఖండించారు. ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షున్ని అరెస్ట్ చేయడం పోలీసుల దుందుడుకు చర్యగా వ్యాఖ్యానించారు. ఎన్నికల నియమావళిని అన్ని పార్టీలకు సమానంగా అమలు చేయాలన్నారు. బిజెపి శ్రేణులను దుబ్బాక ఉపఎన్నికల సందర్భంగా భయబ్రాంతులకు గురిచేసేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. 

 మరోవైపు సిద్దిపేటలో పోలీసుల వైఖరిని నిరసిస్తూ కరీంనగర్ లోని తన కార్యాలయంలో ఎంపీ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం నాడు రాత్రి దీక్షకు దిగాడు.

సిద్దిపేటకు వెళ్లకుండా బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసి కరీంనగర్ కు తరలించారు. దీంతో కరీంనగర్ లోని తన కార్యాలయంలోనే బండి సంజయ్ స్వీయ నిర్భంధంలోకి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకొన్న బీజేపీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున ఎంపీ కార్యాలయం వద్దకు చేరుకొన్నారు. దుబ్బాకలో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో సోమవారం నాడు సోదాలు నిర్వహించారు.

also read:దుబ్బాక నుండే టీఆర్ఎస్ కు రాజకీయ సమాధి: బండి సంజయ్

సిద్దిపేటలోని అంజన్ రావు ఇంట్లో పోలీసులు రూ. 18 లక్షలు స్వాధీనం చేసుకొన్నారు. ఈ సమయంలో సుమారు రూ. 5 లక్షలను బీజేపీ కార్యకర్తలు తీసుకెళ్లినట్టుగా సిద్దిపేట సీపీ ప్రకటించారు.

బండి సంజయ్ కు అమిత్ షా ఫోన్

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం నాడు ఫోన్ చేశారు. సిద్దిపేటలో చోటు చేసుకొన్న పరిణామాలపై ఆయన ఆరా తీశారు. జరిగిన విషయాన్ని ఎంపీ మంత్రికి వివరించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!