హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్: రిమాండ్ రిపోర్టు క్వాష్ కోరుతూ పిటిషన్

By narsimha lodeFirst Published Jan 4, 2022, 2:48 PM IST
Highlights

తెలంగాణ హైకోర్టులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిటిషన్ దాఖలు చేశారు. కరీంనగర్ పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టును క్వాష్ చేయాలని ఆ పిటిషన్ లో కోరారు.

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుBandi Sanjay  తనపై కరీంనగర్ పోలీసులు దాఖలు చేసిన Remand Redport ను క్వాష్ చేయాలని Telangana High Court  క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. 14 రోజుల రిమాండ్ సరైంది కాదని ఆ పిటిషన్ లో కోరారు.తనపై ఉన్న ఐపీసీ 333 సెక్షన్ ను కొట్టివేయాలని ఆ పిటిషన్ లో బండి సంజయ్ కోరారు. అయితే ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారణ చేయాలనే సంజయ్ అభ్యర్ధనను న్యాయస్థానం అంగీకరించింది. ఈ పిటిషన్ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది.  రోస్టర్ ప్రకారం ఈ పిటిషన్ తన పరిధిలోకి రాదని జస్టిస్ లక్ష్మణ్  బెంచ్ తెలిపింది. ప్రజా ప్రతినిధుల కేసులు విచారించే బెంచ్ కి ఈ పిటిషన్ ను పంపాలని హైకోర్టు రిజిస్ట్రీకి జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ సూచించింది. 

also read:బండి సంజయ్ అరెస్ట్: హైద్రాబాద్‌లో బీజేపీ నేతల మౌన దీక్ష

317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగిన బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. బండి సంజయ్ పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లపై కూడా ఆయన తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవాళ కరీంనగర్ కోర్టులో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అదే సమయంలో కరీంనగర్ పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో బండి సంజయ్ పిటిషన్ దాఖలు చేశారు.

బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ ఇవాళ  ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా  పార్టీ కార్యాలయాల్లో మౌన దీక్షలకు దిగాలని ఆ పార్టీ  నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం మేరకు  బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేతలు మౌన దీక్షను చేపట్టారు.  రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో  పార్టీ నేతలు ఈ దీక్షల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు బీజేపీ నేతలు మౌన దీక్షను ఎంచుకొన్నారు. మరోవైపు సాయంత్రం ఇవాళ క్యాండిల్ ర్యాలీకి కూడా బీజేపీ నాయకత్వం పిలపునిచ్చింది.  హైద్రాబాద్ ఎల్బీ స్టేడియం నుండి లిబర్టీ వరకు జరిగే క్యాండిల్ ర్యాలీలో జేపీ నడ్డా పాల్గొంటార అయితే ఈ క్యాండిల్ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు.

కరీంనగర్ జైలులో ఉన్న బండి సంజయ్ ను కేంద్ర మత్రి కిషన్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మంగళవారం నాడు పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును బీజేపీ నేతలు తప్పుబట్టారు. మరో వైపు 317 జీవో అంశం ప్రస్తుతం ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలను కలవరపరుస్తుంది.

317 జీవోను రద్దు చేయాలని  ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ జీవోతో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నష్టేమ వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నారు.ఈ విషయమై  సీఎం జోక్యం చేసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఉపాధ్యాయ, ఉద్యోగులకు నష్టం చేసే ఈ జీవోను రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇదే డిమాండ్ తో ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు బీజేపీ మద్దతును ప్రకటించింది. స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు దిగి అరెస్టయ్యాడు. 

click me!