తెలంగాణకు ఇచ్చిన నిధులపై చర్చకు సిద్దం: కేసీఆర్ సర్కార్ కు బండి సంజయ్ సవాల్

By narsimha lode  |  First Published Feb 12, 2023, 3:32 PM IST

తెలంగాణ రాష్ట్రానికి  కేంద్రం  ఇచ్చిన నిధులపై ఎక్కడైనా చర్చకు  తాము సిద్దంగా  ఉన్నామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  చెప్పారు.  
 


హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రానికి   కేంద్రం  ఇచ్చిన  నిధులపై  ఢిల్లీ  లేదా  గోల్కోండలోనైనా  చర్చకు తాము సిద్దంగా ఉన్నామని   బీజేపీ  తెలంగాణ రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్  చెప్పారు.ఆదివారం నాడు   బీజేపీ  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం  రాష్ట్రానికి  నిధులు  మంజూరు  చేసినా    కేసీఆర్  సర్కార్  తప్పుడు  ప్రచారం  చేస్తుందన్నారు.

రాష్ట్రానికి ఇప్పటివరకు  కేంద్రం  నుండి ఎన్ని నిధులు వచ్చాయో చర్చకు తాము సిద్దంగా  ఉన్నామని  బండి సంజయ్  స్పష్టం  చేశారు. అసెంబ్లీలో  సమస్యలు  చర్చింకుండా  బీజేపీని తిడుతున్నారని  ఆయన బీఆర్ఎస్ పై మండిపడ్డారు.  అసెంబ్లీలో నరేంద్ర మోడీ  లేనప్పుడు  ఆయన  పేరును ఎలా తీస్తారని ఆయన ప్రశ్నించారు. మతం  కోసం  మాత్రమే  ఎంఐఎం పనిచేస్తుందని బండి  సంజయ్  చెప్పారు. 

Latest Videos

undefined

కేంద్ర ప్రభుత్వం  ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో  తెలంగాణకు  కేటాయింపులు సరిగా లేవని బీఆర్ఎస్  నేతలు విమర్శలు  చేవారు. కేంద్రం సవతి తల్లి  ప్రేమ చూపుతుందని  కూడా బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శలు  చేశారుకేంద్ర ప్రభుత్వం  కేంద్రంపై  వివక్ష చూపుతుందని  అవకాశం దొరికినప్పుడల్లా  బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.

ఇవాళ శాసనమండలి వేదికగా  కేంద్ర ప్రభుత్వంపై  కేటీఆర్ విమర్శలు  చేశారు  హైద్రాబాద్  మెంట్రో ప్రాజెక్టుకు  నిధులు ఇవ్వడం లేదని  కేటీఆర్ విమర్శించారు. ఇతర  రాష్ట్రాల మెట్రో  ప్రాజెక్టులకు  నిధులను కేంద్రం  మంజూరు చేసిందని కేటీఆర్ విమర్శించారు. కేంద్ర బడ్జెట్ లో  తెలంగాణ కు ఏం జరగలేదని  సీఎం కేసీఆర్ ప్రకటించారు.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన  మెడికల్ కాలేజీల్లో  తెలంగాణకు  ఒక్కటి కూడా కేంద్రం  మంజూరు చేయలేదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం  చేస్తున్న ప్రచారంపై   తాము చర్చకు సిద్దంగా  ఉన్నామని బండి సంజయ్  ఇవాళ ప్రకటించారు.  

click me!