తెలంగాణ బీజేపీ నేతల రహస్య సమావేశాలు: కొందరిపై వేటు పడే ఛాన్స్

Published : Jan 19, 2022, 01:56 PM ISTUpdated : Jan 19, 2022, 02:01 PM IST
తెలంగాణ బీజేపీ నేతల రహస్య సమావేశాలు: కొందరిపై వేటు పడే ఛాన్స్

సారాంశం

బీజేపీలో కొందరు సీనియర్లు సమావేశాలు నిర్వహించడంపై ఆ పార్టీ నాయకత్వం ఆరా తీసింది. పార్టీ నేతలు రహస్య సమావేశాలు నిర్వహించిన కొందరిపై చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.

హైదరాబాద్: Bjpలో కొందరు సీనియర్లు secret సమావేశాలు నిర్వహించడంపై ఆ పార్టీ నాయకత్వం ఆరా తీసింది. రహస్య సమావేశాలు నిర్వహించిన కొందరు నేతలపై పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొనే అవకాశం ఉందని సమాచారం.

పార్టీలో కొత్తగా వచ్చిన వారు తమను ఎదగనీయకుండా తొక్కేస్తున్నారనే అసంతృప్తితో ఉన్న నేతలంతా రహస్య సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన 17 మంది నేతలు ఈ రహస్య సమావేశాలు నిర్వహించారని సమాచారం.

మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, ధర్మారావు లతో పాటు ఆ పార్టీ నేతలు సుగుణాకర్ రావు, రాజేశ్వరరావు, నాగూరావు నామోజీ, మల్లారెడ్డి, శ్రీనివాస్, చింతా సాంబమూర్తి తదితరులు ఈ రహస్య సమావేశాల్లో పాల్గొన్నారు. రహస్య సమావేశాలతో పాటు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించారని సమాచారం., కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కూడా సమావేశాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది.

రహస్య సమావేశాలపై పార్టీ నాయకత్వం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ విషయమై పార్టీ నాయకత్వం ఆరా తీసింది. మాజీ కేంద్ర మంత్రి Kishan Reddyతో కూడా అసంతృప్తి నేతలు సమావేశమయ్యారని సమాచారం. ఈ విషయమై ఆరా తీసిన పార్టీ నాయకత్వం కొందరు నేతలకు పార్టీ కమిటీల్లో చోటు కల్పించారు.  చింతా సాంబమూర్తి, రాజేశ్వరరావు లకు కమిటీల్లో చోటు కల్పించి వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు.

మరో వైపు బీజేపీ నేతల రహస్య సమావేశంపై మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డికి అప్పజెప్పింది.
కరీంనగర్ జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేసిన నేతలు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అయితే  ఈ విషయమై ఇంద్రసేనారెడ్డి  రహస్య సమావేశాలు నిర్వహించిన నేతలతో చర్చించినట్టుగా తెలుస్తోంది.   ఈ సమావేశాలపై ఇంద్రసేనారెడ్డి సమాచారాన్ని సేకరించి పార్టీ నాయకత్వానికి అందించనున్నారు. ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR: కేసీఆర్ ఎంట్రీతో తెలంగాణ రాజకీయం హీట్.. హాట్ కామెంట్స్ తో రచ్చ
KCR Press Meet from Telangana Bhavan: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్‌| Asianet News Telugu