ప్రగతి భవన్‌లోకి వెళ్లేందుకు జేసీ దివాకర్ రెడ్డి ప్రయత్నం:పోలీసులతో వాగ్వాదం, ఇంటికి తరలింపు

Published : Jan 19, 2022, 01:24 PM ISTUpdated : Jan 19, 2022, 03:20 PM IST
ప్రగతి భవన్‌లోకి వెళ్లేందుకు జేసీ దివాకర్ రెడ్డి ప్రయత్నం:పోలీసులతో వాగ్వాదం, ఇంటికి తరలింపు

సారాంశం

మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ప్రగతి భవన్  వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అపాయింట్ మెంట్ లేనిదే ప్రగతి భవన్ లోనికి అనుమతించలేదు.


హైదరాబాద్: మాజీ మంత్రి JC Diwakar Reddy Pragathi Bhavan  వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు.  అపాయింట్ మెంట్  లేకుండా అనుమతి ఇవ్వబోమని పోలీసులు జేసీ దివాకర్ రెడ్డిని అడ్డుకొన్నారు. ప్రగతి భవన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.  

అయితే అపాయింట్‌మెంట్  లేనిదే ప్రగతి భవన్ లోకి అనుమతి ఇవ్వబోమని Security సిబ్బంది చెప్పారు.సీఎం లేకపోతే మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ జేసీ దివాకర్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బందికి చెప్పారు. . అయినా అనుమతి కావాల్సిందేనని చెప్పడంతో చేసేదేమీలేక జేసీ వెనుదిరిగి వెళ్లిపోయారు.  అయితే ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బందితో జేసీ దివాకర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.

ఎవరైనా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కలవాలన్నా, ప్రగతి భవన్‌కు వెళ్లాలన్నా ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకుంటే తప్ప వాళ్లను లోపలికి పంపరు. అయితే జేసీ ఎటువంటి అనుమతి లేకుండా నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారు.

దీంతో అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అనుమతి లేనిదే తాము లోపలికి పంపబోమని స్పష్టం చేశారు. అనుమతైనా ఉండాలి.. లేదా ప్రగతి భవన్ నుంచి పెద్దలతో ఫోన్ అయినా చేయించాలని జేసీకి సెక్యురిటీ సిబ్బంది విజ్ఞప్తి చేశారు. అయితే తనకు అపాయింట్‌మెంట్ ఇచ్చేదేమిటని, తాను లోపలకు వెళతానని సెక్యూరిటీతో జేసీ వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ అపాయింట్‌మెంట్ లేనిదే తాము లోపలికి అనుమతించబోమని సెక్యూరిటీ నచ్చచెప్పడంతో చేసేదేమీలేక జేసీ దివాకర్ రెడ్డి వెనుదిరిగారు.

ఈ విషయమై ప్రగతి భవన్ వద్ద పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పంజాగుట్ట పోలీసులు వెంటనే జేసీ దివాకర్ రెడ్డిని స్టేషన్ కు తరలించారు.  అక్కడి నుండి వాహనంలో జేసీ దివాకర్ రెడ్డిని ఆయన నివాసానికి తరలించారు.గతంలో Assembly  జరిగే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను, మంత్రి కేటీఆర్ ను కూడా జేసీ దివాకర్ రెడ్డి కలిశారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR Press Meet: రేవంత్ రెడ్డి పై రెచ్చిపోయిన కేసీఆర్ | Asianet News Telugu
KCR: కేసీఆర్ ఎంట్రీతో తెలంగాణ రాజకీయం హీట్.. హాట్ కామెంట్స్ తో రచ్చ