చిన జీయర్ మాట‌లు మధ్యయుగాన్ని గుర్తుకు తెస్తున్నాయి - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి

By team teluguFirst Published Jan 19, 2022, 1:44 PM IST
Highlights

చిన జీయ‌ర్ స్వామి మాట‌లు మ‌ధ్య‌యుగం నాటి కాలాన్ని గుర్తుకు తెచ్చేలా ఉన్నాయ‌ని క‌మ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) తెలంగాణ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడ వెంక‌ట రెడ్డి అన్నారు. ఈ మేర‌కు బుధ‌వారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

చిన జీయ‌ర్ స్వామి మాట‌లు మ‌ధ్య‌యుగం నాటి కాలాన్ని గుర్తుకు తెచ్చేలా ఉన్నాయ‌ని క‌మ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) తెలంగాణ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడ వెంక‌ట రెడ్డి అన్నారు. ఈ మేర‌కు బుధ‌వారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన ఓ కార్యక్ర‌మంలో చినజీయ‌ర్ చేసిన వ్యాఖ్య‌లు స‌రిగా లేవ‌ని అన్నారు. ఇవి ప్ర‌జ‌ను ఆందోళ‌న‌ల‌కు గురి చేస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. కులాల‌ను నిర్మూలించ‌కూడ‌ద‌ని, ఎవ‌రి కుల వృత్తిని వారు కొన‌సాగించాల‌ని, మాంసాహారం తిన‌కూడ‌ద‌ని ప్ర‌వ‌చ‌నాల్లో భాగంగా చిన‌జీయ‌ర్ ప‌లికిన మాట‌లు మ‌ధ్య యుగం కాలంలో చెల్లుబాటు అయ్యాయ‌ని అన్నారు. సంకుచిత భావాలు క‌లిగిఉన్న వ్య‌క్తి.. ఎన్నో కోట్లు ఖ‌ర్చు చేసి క‌ట్టిన విగ్ర‌హాల‌కు స‌మాన‌త్వ ప్ర‌తిమ అని పేరు ఖ‌రారు చేయ‌డం విచిత్రంగా ఉంద‌ని తెలిపారు. చిన జీయ‌ర్ స్వామి మాట‌ల వ‌ల్ల బ‌హుజ‌న‌లు మనోభావాలు దెబ్బ‌తిన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్య‌లు చేసిన చినజీయ‌ర్ స్వామి ఆశ్ర‌మంలో నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌కు భార‌త రాష్ట్ర‌పతి, ప్ర‌ధాన‌మంత్రి, సీఎం హాజ‌రుకావ‌డం స‌రికాద‌ని తెలిపారు. ఇలా హాజ‌రుకావ‌డం రాజ్యాంగాన్ని అవ‌మానించ‌డ‌మే అవుతుంద‌ని ఆయ‌న తెలిపారు. 

click me!