పంచాయితీ సెక్రటరీని బెదిరించి ఎన్ఓసీ తీసుకొన్నారు: ఈటల భార్య జమున హేచరీస్ పై రెవిన్యూ అధికారులు

Published : May 17, 2021, 03:59 PM IST
పంచాయితీ సెక్రటరీని బెదిరించి ఎన్ఓసీ తీసుకొన్నారు: ఈటల భార్య జమున హేచరీస్ పై రెవిన్యూ అధికారులు

సారాంశం

జిల్లాలోని 2018 లో జమున హేచరీస్, 2019 లో జమున హేచరీస్ ఎన్ ఓసీ తీసుకొన్న సర్వే నెంబర్లకు తేడా ఉందని  రెవిన్యూ అధికారులు ప్రకటించారు. 

మెదక్: జిల్లాలోని 2018 లో జమున హేచరీస్, 2019 లో జమున హేచరీస్ ఎన్ ఓసీ తీసుకొన్న సర్వే నెంబర్లకు తేడా ఉందని  రెవిన్యూ అధికారులు ప్రకటించారు. సోమవారం నాడు  మెదక్ జిల్లాలోని హకీంపేట, మాసాయిపేట గ్రామాల పరిధిలో  జమున హేచరీస్  సంస్థ ఆక్రమించుకొన్నట్టుగా చెబుతున్న భూముల్లో మాసాయిపేట, వెల్ధర్తి తహసీల్దార్లు  సోమవారం నాడు విచారణ నిర్వహించారు. పంచాయితీ సెక్రటరీని బెదిరించి ఎన్ ఓ సీ తీసుకొన్నారని విచారణలో తేలిందని రెవిన్యూ అధికారులు తెలిపారు. 

హకీంపేటలో 111 సర్వే నెంబర్ లో అనధికార నిర్మాణం జరుగుతుంటే  గ్రామ కార్యదర్శి రెండు సార్లు నోటీసులు ఇచ్చారని చెప్పారు. 130 సర్వే నెంబర్ లో 18.35 ఎకరాలు ఉంటే అందులో 3 ఎకరాలు పట్లా, 15.35 ఎకరాలు సీలింగ్ భూమిగా తమ విచారణలో తేలిందని తహసీల్దార్లు ప్రకటించారు. 2018లో 55, 124, 126,128, 129 సర్వే నెంబర్లకు ఎన్ ఓ సీ తీసుకొన్నట్టుగా జమున హేచరీస్ సంస్థ ప్రతినిధులు  చెబుతున్నారన్నారు.

also read:ఈటల కుటుంబానికి నోటీసులు: జమున హేచరీస్ భూములపై రెవిన్యూ అధికారుల విచారణ

కానీ 2019లోనే పాత సర్వే నెంబర్లకు సర్వే నెంబర్ 130 ని చేర్చి ఎన్ ఓ సీ తీసుకొన్నారని రెవిన్యూ అధికారులు సోమవారం నాడు మీడియాకు చెప్పారు. 95.22 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించి 75 మంది నోటీసులు ఇచ్చామని రెవిన్యూ అధికారులు ప్రకటించారు.  ఈ నెల 26,27,28 తేదీల్లో భూముల సర్వే  నిర్వహస్తామన్నారు.ఈ నెల 25న రైతుల విచారణ నిర్వహిస్తామన్నారు. రెండు గ్రామ పంచాయితీల సెక్రటరీల స్టేట్ మెంట్ తీసుకొన్నట్టుగా రెవిన్యూ అధికారులు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

TS Inter Results: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల: బాలికలదే హవా.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..?
తెలంగాణ ఇంట‌ర్ రిజ‌ల్ట్స్ వ‌చ్చేశాయ్‌.. వాట్సాప్‌లో అంద‌రికంటే ముందే తెలుసుకోండి