హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌‌గా నియామకం: స్పందించిన దత్తాత్రేయ

By narsimha lodeFirst Published Sep 1, 2019, 5:36 PM IST
Highlights

హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన తర్వాత బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ స్పందించారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి కచ్చితంగా సముచిత స్థానం కల్పించడం ఒక్క బీజేపీకి మాత్రమే సాధ్యమని దత్తాత్రేయ తెలిపారు. 

హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన తర్వాత బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ స్పందించారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కృతజ్ఞతలు తెలిపారు.

మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి కచ్చితంగా సముచిత స్థానం కల్పించడం ఒక్క బీజేపీకి మాత్రమే సాధ్యమని దత్తాత్రేయ తెలిపారు. సుధీర్ఘకాలంగా పార్టీకి సేవలందించినందుకు దక్కిన గౌరవంగా ఆయన అభివర్ణించారు.

ఎక్కడున్నా అంకిత భావంతో పనిచేస్తానని దత్తాత్రేయ పేర్కొన్నారు. మరోవైపు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమించారని తెలియగానే బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, సన్నిహితులు ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. 

విలువలు, క్రమశిక్షణ, విధేయత: దత్తన్న రాజకీయ ప్రస్థానం

తెలంగాణ గవర్నర్ నరసింహాన్ బదిలీ?

నరసింహన్ బదిలీ: తెలంగాణకు సౌందర రాజన్, హిమాచల్‌కు దత్తన్న

ప్రత్యక్ష ఎన్నికల్లో కలిసిరాని విజయం... వరించిన గవర్నర్ గిరి

దత్తాత్రేయకు బీజేపీ కార్యకర్తల అభినందనలు (ఫోటోలు)

click me!