నరసింహన్ బదిలీ: గవర్నర్‌తో కేసీఆర్ భేటీ

Published : Sep 01, 2019, 04:56 PM ISTUpdated : Sep 01, 2019, 06:18 PM IST
నరసింహన్ బదిలీ: గవర్నర్‌తో కేసీఆర్ భేటీ

సారాంశం

తెలంగాణ గవర్నర్ నరసింహన్ బదిలీ కావడంతో సీఎం కేసీఆర్ ఆదివారం నాడు నరసింహన్ తో భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగానే వీరిద్దరూ కలుసుకొన్నారని సమాచారం.

హైదరాబాద్:తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర గవర్నర్ నరసింహాన్‌తో ఆదివారం నాడుసాయంత్రం భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగానే ఈ బేటీ అయినట్టుగా సీఎంఓ వర్గాలు తెలిపాయి.

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న నరసింహన్  బదిలీ అయ్యారు. తెలంగాణకు కొత్త గవర్నర్ గా సౌందర రాజన్ నియమిస్తూ రాష్ట్రపతి ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. తెలంగాణకు  9 ఏళ్ల 9 మాసాల పాటు నరసింహన్ గవర్నర్ గా కొనసాగారు.రాష్ట్రానికి అందించిన సహాయసహకారానికి గాను  సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్ కు ధన్యవాదాలు తెలిపారు 

నరసింహన్ విధులకు దూరమైన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి నరసింహన్ సేవలను వినియోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. సుదీర్ఘ కాలం పాటు రాష్ట్రానికి నరసింహన్ సేవ చేశాడు. దీంతో కేసీఆర్ ఆయన సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్టుగా సమాచారం.

ఇప్పటికే రిటైర్డ్ ఐఎఎఎస్, ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ సలహదారులుగా కేసీఆర్ నియమించుకొన్నారు. నరసింహన్  ను కూడ నియమించుకొనే అవకాశం ఉందని అంటున్నారు.

సంబంధిత వార్తలు

విలువలు, క్రమశిక్షణ, విధేయత: దత్తన్న రాజకీయ ప్రస్థానం

తెలంగాణ గవర్నర్ నరసింహాన్ బదిలీ?

నరసింహన్ బదిలీ: తెలంగాణకు సౌందర రాజన్, హిమాచల్‌కు దత్తన్న

ప్రత్యక్ష ఎన్నికల్లో కలిసిరాని విజయం... వరించిన గవర్నర్ గిరి

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్