అమిత్ షాతో పరిపూర్ణానంద స్వామి భేటీ... అందుకోసమేనా?

By Arun Kumar PFirst Published Oct 8, 2018, 5:18 PM IST
Highlights

తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే ప్రాంతీయ పార్టీలతో పాటుగా జాతీయ పార్టీలు కూడా ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. తాజాగా  శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి డిల్లీ పర్యటన తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. 
 
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుండి  ఆహ్వానం అందడంతోనే పరిపూర్ణానంద డిల్లీ పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది. మొదట డిల్లీలో బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో పరిపూర్ణానంద భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వీరిద్దరు చర్చించారు. 

ఆ తర్వాత పరిపూర్ణానంద బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ లో జరగనున్న ఎన్నికలపై ఇరువురు చర్చించయినట్లు సమాచారం. ఈ భేటీ  లె బిజెపి ఎమ్మెల్యే ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ కూడా పాల్గొన్నారు.  

తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన వేళ పరిపూర్ణానందకు బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పరిపూర్ణానందను తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించనున్నారనే వార్త గత కొద్ది కాలంగా వినిపిస్తోంది. మరోవైపు ఆయనకు హైదరాబాద్ ఎంపీ సీటు ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.ఈ సమయంలో అమిత్ షా తో పరిపూర్ణానంద భేటీ జరగడం రాజకీయంగా చర్చకు దారితీసింది. 

సంబంధిత వార్తలు

పొలిటికల్ ఎంట్రీపై స్వామి పరిపూర్ణానంద ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీలోకి పరిపూర్ణానంద స్వామి

హైదరాబాద్ చేరుకున్న స్వామి పరిపూర్ణానంద ధర్మజ్వాల ర్యాలీ

పరిపూర్ణానందపై బహిష్కరణ ఎత్తివేత.. నేడు నగరానికి రాక

రాజకీయాల్లోకి పరిపూర్ణానంద స్వామి..?

click me!