రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, విజయ సంకల్ప సభ జరిగిన తీరుపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ నెల 5న సమీక్ష నిర్వహించనుంది. విజయ సంకల్ప సభ విజయవంతం కావడంపై బీజేపీ జాతీయ నాయకత్వం కూడా సంతృప్తిగా ఉంది.
హైదరాబాద్: రెండు రోజుల పాటు నిర్వహించిన BJP National Executive Meeting తో పాటు విజయ సంకల్ప సభపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ సమీక్ష నిర్వహించనుంది.
ఈ నెల 2, 3 తేదీల్లో Telangana లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి.ఈ సమావేశాల ముగింపును పురస్కరించుకొని Secunderabad Parade Ground లో నిర్వహించిన విజయసంకల్ప్ సభ జరిగిన తీరు తెన్నులపై పార్టీ రాష్ట్ర నాయకత్వం చర్చించనుంది. విజయ సంకల్ప్ సభ విజయవంతమైందని ఆ పార్టీ నాయకత్వం ఉత్సాహంతో ఉంది. అయితే ఏ జిల్లా నుండి ఎంతమంది వచ్చారు, ఏ నేత ఈ సభను విజయవంతం చేసేందుకు క్రియాశీలకంగా వ్యవహరించారనే విషయమై బీజేపీ నేతలు సమీక్ష నిర్వహించనున్నారు.
undefined
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు 18 ఏళ్ల తర్వాత హైద్రాబాద్ లో నిర్వహించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 18 ఏళ్ల క్రితం జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించారు. అయితే తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవాలని కమల దళం ప్లాన్ చేస్తుంది. రాష్ట్రంలో పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపేందుకు గాను ఈ సభ టానిక్ మాదిరిగా పనిచేస్తుందనే అభిప్రాయంతో బీజేపీ నేతలున్నారు.
మరో వైపు తెలంగాణలో ఇతర పార్టీల నుండి తమ పార్టీలోకి కీలక నేతలను ఆహ్వానించేందుకు గాను బీజేపీ నాయకత్వం ప్లాన్ చేస్తుంది. బీజేపీ బహిరంగ సభలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరారు. చాలా కాలంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డితో బీజేపీ నేతలు టచ్ లో ఉన్నారు. ఈ నెల 3న కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.
ఇదిలా ఉంటే బీజేపీలోకి ఇతర పార్టీలనుండి నేతలను చేర్చుకొనేందుకు అవసరమైన చర్చలు జరిపేందుకు గాను మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కమిటీకి మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి ఇంచార్జీగా కొనసాగుతున్నారు. అయితే ఇంద్రసేనారెడ్డి ఈ బాధ్యతల నుండి తప్పుకొనే అవకాశం ఉంది. ఇంద్రసేనారెడ్డి స్థానంలో ఈటల రాజేందర్ కు ఈ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచచారం పార్టీ వర్గాల్లో సాగుతుంది. అయితే ఈ విషయమై పార్టీ నుండి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ నెల 5న జరిగే సమావేశంలో ఈ విషయంపై కూడా చర్చించే అవకాశం లేకపోలేదు.
తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టేందుకు గాను ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలు, కీలక నేతలను తమ వైపునకు లాక్కొనేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించే అవకాశాలు లేకపోలేదు. గత ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ కు చెందిన కొందరు కీలక నేతలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.