బీజేపీ తొలి జాబితా: కోమటిరెడ్డి సహా సీనియర్లకు దక్కని చోటు

By narsimha lode  |  First Published Oct 22, 2023, 3:02 PM IST


బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో  కొందరు సీనియర్ నేతలకు  టిక్కెట్టు దక్కలేదు.  రెండో జాబితాలో సీనియర్లు చోటు కల్పించే అవకాశం ఉందని సమాచారం.


హైదరాబాద్: బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో కొందరు సీనియర్ నేతలకు  టిక్కెట్టు దక్కలేదు.  తెలంగాణలో పార్టీలో సీనియర్లుగా ఉన్న నేతలకు టిక్కెట్టు దక్కకపోవడంపై  ప్రస్తుతం చర్చ సాగుతుంది.

మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి మాజీ ఎంపీ  జితేందర్ రెడ్డి  ధరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ స్థానం నుండి తనకు కాకుండా తన కొడుకుకు టిక్కెట్టు ఇవ్వాలని  జితేందర్ రెడ్డి కోరినట్టుగా ప్రచారం సాగుతుంది. దీంతో  ఈ అసెంబ్లీ స్థానం తొలి జాబితా నుండి  మినహాయించినట్టుగా  సమాచారం.  మరో వైపు  డీకే అరుణను  గద్వాల నుండి కాకుండా  మరో స్థానం నుండి  పోటీ చేయించాలని పార్టీ నాయకత్వం భావిస్తుందనే ప్రచారం కూడ లేకపోలేదు.  దీంతో  గద్వాల అసెంబ్లీ స్థానాన్ని తొలి జాబితాలో చోటు దక్కలేదంటున్నారు.

Latest Videos

undefined

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండు అసెంబ్లీ సీట్లు కోరుతున్నారని సమాచారం.  ఎల్ బీ నగర్ , మునుగోడు అసెంబ్లీ స్థానాలను  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరుతున్నారు. మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి తన భార్యను బరిలోకి దింపాలని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు.  ఎల్ బీ నగర్ అసెంబ్లీ స్థానంనుండి  పోటీ చేయాలని  రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారని సమాచారం.  దీంతో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు తొలి జాబితాలో లేదని  పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.  వివేక్ వెంకటస్వామి చెన్నూరు, ధర్మపురి అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుండి  నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు.

చెన్నూరు అసెంబ్లీ కాకుండా ధర్మపురి అసెంబ్లీ స్థానం కావాలని వెంకటస్వామి కోరుకుంటున్నట్టుగా  సమాచారం. తొలి జాబితాలో ధర్మపురి అసెంబ్లీ స్థానం నుండి ఎస్. కుమార్ ను బీజేపీ బరిలోకి దింపింది.  అయితే  చెన్నూరు నుండి వివేక్ వెంకటస్వామి బరిలోకి దిగుతారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.  ఈ కారణంగానే వివేక్ వెంకటస్వామి పేరును తొలి జాబితాలో లేదు. ఇదిలా ఉంటే  చెన్నూరు అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్ధిగా  వివేక్ సోదరుడు  వినోద్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ స్థానాన్ని కాంగ్రెస్ సీపీఐకి కేటాయించకపోతే  వినోద్ బరిలో ఉండనున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా వినోద్ బరిలో ఉంటే బీజేపీ తరపున వివేక్ చెన్నూరు నుండి పోటీ చేస్తారా అనేది  తేలాల్సి ఉంది.

ఈ విషయమై  వెంకటస్వామితో మరోసారి చర్చించిన తర్వాత  రెండో జాబితాలో వివేక్ వెంకటస్వామి పేరును బీజేపీ ప్రకటించనుందని తెలుస్తుంది.

తాండూరు, రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానాల్లో  కొండా విశ్వేశ్వర్ రెడ్డిని బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తుంది. అయితే ఏ  అసెంబ్లీ నుండి పోటీ చేయాలనే విషయమై  కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంకా నిర్ణయించుకోలేదంటున్నారు.ఈ కారణంగానే  కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరు తొలి జాబితాలో దక్కలేదు. విజయశాంతిని ఏ అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దింపాలనే దానిపై బీజేపీ నాయకత్వం  చర్చిస్తుంది.  దీంతో విజయశాంతి పేరు తొలి జాబితాలో లేదు.

కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి విజయశాంతి  పోటీ చేయాలనే ఆసక్తిని చూపుతున్నారు. మూడు రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా  ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.  గజ్వేల్ నుండి బండి సంజయ్, కామారెడ్డి నుండి తాను కేసీఆర్ పై పోటీ చేయాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు.  కానీ తొలి జాబితాలో  కామారెడ్డి నుండి వెంకటరమణ రెడ్డిని  బీజేపీ బరిలోకి దింపింది.

also read:కేసీఆర్ పై ఈటల పోటీ: తొలిసారిగా గజ్వేల్ నుండి బరిలోకి రాజేందర్

 అయితే  విజయశాంతిని  ఏ స్థానం నుండి బరిలోకి దింపుతారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని ఎండల లక్ష్మీనారాయణ భావిస్తున్నారు.   మాజీ ఎంపీ  బూర నర్సయ్య గౌడ్ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానం నుండి పోటీకి ఆసక్తి చూపారు. అయితే ఈ స్థానం నుండి నోముల దయానంద్ గౌడ్ కు బీజేపీ నాయకత్వం  టిక్కెట్టు కేటాయించింది. దీంతో  ఆలేరు నుండి  పోటీకి బూర నర్సయ్య గౌడ్ ఆసక్తి చూపుతారా లేదా  పోటీకి దూరంగా ఉంటారా అనేది రానున్న రోజుల్లో  స్పష్టత రానుంది.
 

click me!