బండి సంజయ్ ఆరెస్ట్‌: జేపీ నడ్డా ఆరా , మాజీ ఎమ్మెల్సీకి ఫోన్

By narsimha lode  |  First Published Apr 5, 2023, 10:06 AM IST

 బీజేపీ  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  అరెస్ట్  విషయమై ఆ  పార్టీ  కేంద్ర నాయకత్వం  ఆరా తీసింది.  ఈ విషయమై  జేపీ నడ్డా  పార్టీ నేతలకు  ఫోన్  చేశారు. 


హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ పై  బీజేపీ జాతీయ నాయకత్వం  ఆరా తీసింది.  ఈ విషయమై  బీజేపీ  జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  బుధవారంనాడు  ఉదయం  ఆ పార్టీ నేతలకు  ఫోన్  చేశారు.  మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు  కు  బీజేపీ జాతీయ అధ్యక్షుడు  జేపీ నడ్డా  ఫోన్  చేశారు. బండి సంజయ్ అరెస్ట్  విషయమై  జేపీ నడ్డా  వివరాలు  తెలుసుకున్నారు.  బండి సంజయ్ అరెస్ట్  సమయంలో  పోలీసులు వ్యవహరించిన తీరును  కూడా  రామచంద్రరావు  జేపీ నడ్డాకు  వివరించారు.  బండి సంజయ్ కు  సంఘీభావంగా  నిలబడాలని  రామచంద్రరావుకు  జేపీ నడ్డా  సూచించారు.

కనీసం కారణం తెలపకుండా  అరెస్ట్  చేయడంపై  జేపీ నడ్డా  ఆశ్చర్యం వ్యక్తం  చేశారని బీజేపీ వర్గాలు  చెబుతున్నాయి. అరెస్ట్ పై  కారణం  చెప్పేవరకు నిలదీయాలని  జేపీ నడ్డా  బీజేపీ నేతలకు  సూచించారు. బండి సంజయ్   అరెస్ట్ విషయం తెలుసుకొని  బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన  ఎమ్మెల్యే రఘునందన్ రావును  కూడా పోలీసులు అరెస్ట్  చేసిన విషయాన్ని  రామచంద్రరావు  జేపీ నడ్డాకు  తెలిపారు. జేపీ నడ్డా ఆదేశాలతో  రామచంద్రరావు  హైద్రాబాద్ నుండి బొమ్మలరామారం  పోలీస్ స్టేషన్ కు బయలు దేరారు. 

Latest Videos

undefined

also read:అరెస్ట్ చేస్తే బండి సంజయ్ భయపడతారా?: రాజాసింగ్

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  ను నిన్న రాత్రి  కరీంనగర్ లో పోలీసులు అరెస్ట్  చేశారు.  టెన్త్ క్లాస్ హిందీ పేపర్  లీక్   విషయమై  పోలీసులు ఆయనను అరెస్ట్  చేశారు. ఈ పేపర్ లీక్  విషయమై  ఆరోపణలు  ఎదుర్కొంటున్న నిందితుడి నుండి బండి సంజయ్ కు  వాట్సాప్ లో  షేర్ అయిందని పోలీసులు చెప్పారు.ఈ విషయమై  పోలీసులు  కరీంనగర్ నుండి  బొమ్మలరామారం  పోలీస్ స్టేషన్ కు తరలించారు.  బండి సంజయ్ అరెస్ట్  విషయం తెలుసుకున్న ఆ పార్టీ శ్రేణులు ఇవాళ  ఉదయం  బొమ్మలరామారం  పోలీస్ స్టేషన్  వద్దకు భారీగా  చేరుకున్నారు.  పోలీస్ స్టేషన్  వద్ద ఆందోళనకు  ప్రయత్నించారు. 
 

click me!