Hyderabad: ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తోంది. ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం కమిటీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మౌలిక సదుపాయాల ఏర్పాట్ల విషయంలో హైదరాబాద్ పర్యటనలో రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది.
Telangana Assembly Election: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. అలాగే, జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ నియమితులయ్యారు.
వివరాల్లోకెళ్తే.. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తోంది. ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం కమిటీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మౌలిక సదుపాయాల ఏర్పాట్ల విషయంలో హైదరాబాద్ పర్యటనలో రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. అలాగే, జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ నియమితులయ్యారు.
ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం ఈ నియామకాలను చేపట్టింది. తాజాగా నియామకాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.
The Central Election Commission () has appointed Commissioner DS Lokesh Kumar as Additional Chief Electoral Officer and another senior officer Sarfraz Ahmed as Joint Chief Electoral Officer in view of this year. pic.twitter.com/sO8lVX3Fho
— Rajamoni Mahesh 🇮🇳 (@Rajamonimahesh)వచ్చే ఎన్నికల కోసం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయాలు గెలుపు వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల మధ్య మాటల తూటాలు పెలుతుండటంతో తెలంగాణ రాజకీయాలు కాకారేపుతున్నాయి. అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గెలుపుపై ధీమాగా ఉంది. ఇంతకుముందు కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తామని హ్యాట్రిక్ గెలుపుపై ఆ పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. ఇదే సమయంలో అధికార పార్టీ గద్దె దించుతామని కాంగ్రెస్, బీజేపీలు జోరుగు ప్రచారం సాగిస్తున్నాయి. కర్నాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ జోష్ మరింతగా పెరిగింది. బీజేపీ సైతం కేంద్ర అగ్రనాయకులను రంగంలోకి దింపుతోంది.