శిక్షణా సమావేశానికి డుమ్మా కొట్టిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్... ఎందుకంటే ?

By team teluguFirst Published Nov 21, 2022, 11:16 AM IST
Highlights

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తన పార్టీ నిర్వహించిన శిక్షణా తరగతులకు హాజరుకాలేదు. హైదరాబాద్ లో బీజేపీ మూడు రోజుల పాటు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసింది. ఇవి ఆదివారం ప్రారంభమయ్యాయి. 

హైదరాబాద్ లో బీజేపీ నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి మూడు రోజులు శిక్షణా తరగతులు ఆదివారం ప్రారంభమయ్యాయి. అయితే ఈ శిక్షణా కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ డుమ్మా కొట్టారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో ఆయనకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే సంతోష్ శిక్షణా సమావేశానికి హాజరకాలేదు.

భార్యపై అనుమానం.. దారుణంగా హత్య చేసి, శరీరాన్ని రెండుగా నరికి అడవిలో పాతిపెట్టిన భర్త..

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రమేయం ఉందని అనుమానిస్తున్న పలువురిపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే అందులో బీఎల్ సంతోష్ కూడా ఉన్నారు. ఈ కేసును సిట్ విచారిస్తోంది. కానీ సంతోష్‌ను అరెస్టు చేయొద్దని, అవసరమైతే విచారణకు పిలవాలని ఆదేశించింది. అయితే సిట్ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.  ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత సంతోష్ పర్యటన షెడ్యూల్‌పై పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయని ‘డెక్కన్ క్రానికల్’నివేదించింది. 

రైల్వేస్టేషన్‌‌లో పట్టాలు తప్పి గూడ్స్ రైలు.. ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన వ్యాగన్లు.. ముగ్గురు మృతి

ఇదిలా ఉండగా.. మొయినాబాద్  ఫాంహౌస్ లో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు  గురి చేశారని రామచంద్రభారతి, సింహయాజీ,  నందకుమార్‌లను  పోలీసులు  అరెస్ట్ గత  నెల  26న అరెస్ట్ చేసిన విషయం  తెలిసిందే.  ఈ కేసు  విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ను  ఏర్పాటు  చేసింది. సిట్ కు  హైద్రాబాద్ సీపీ  సీవీ  ఆనంద్ నేతృత్వం వహిస్తున్నారు.  సిట్ దూకుడుగా  ఈ కేసును  విచారిస్తుంది.  కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ , హర్యానా  రాష్ట్రాల్లో  సిట్  సోదాలు నిర్వహించింది. కేరళ రాష్ట్రంలో ఇద్దరిని సిట్  అదుపులోకి  తీసుకుంది. 

click me!