తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి మా లిస్ట్ ఢిల్లీకి వెళ్లిందని, కాంగ్రెస్ జాబితా మాత్రం ప్రగతి భవన్‌కి వెళ్లిందని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంగనర్ ఎంపీ బండి సంజయ్.
బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంగనర్ ఎంపీ బండి సంజయ్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని ప్రజలు గుర్తించారని అన్నారు. బీఆర్ఎస్ బండారాన్ని మోడీ బయటపెట్టారని, దీంతో అడ్డా మీదున్న కూలీలను తీసుకొచ్చి గులాబీ కండువా కప్పుతున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
అభ్యర్ధుల ఖరారుకు సంబంధించి కలిసికట్టుగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని.. మా లిస్ట్ ఢిల్లీకి వెళ్లిందని, కాంగ్రెస్ జాబితా మాత్రం ప్రగతి భవన్‌కి వెళ్లిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆమోదం కోసం వెయిట్ చేస్తున్నారని.. పాపం ఇది రేవంత్‌కు తెలియదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు మధ్యవర్తిగా ఎంఐఎం వ్యవహరిస్తోందని.. రేవంత్, హరీశ్‌లిద్దరూ బలిచ్చే బకరాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
undefined
ALso Read: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.. : బండి సంజయ్
ఈసారి బీఆర్‌ఎస్, చంద్రశేఖర్‌రావు తమ మేనిఫెస్టోల ద్వారా ప్రజలకు ఏ హామీ ఇచ్చినా ప్రజలు పట్టించుకోరనీ, ఈ ఫూలింగ్ గేమ్ వారికి సరిపోయిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, ఎంఐఎంలను కూడా చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌లా పవిత్రంగా పరిగణిస్తానని చంద్రశేఖర్‌రావు పదే పదే ప్రగల్భాలు పలుకుతున్నారనీ, అయితే, 2014, 2019 ఎన్నికల్లో గెలిచాక తన పార్టీ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారని ఆరోపించారు.
ఎన్నికల్లో గెలుపొందేందుకు బీఆర్‌ఎస్ కుట్ర పన్నుతున్నదని ఆయన అన్నారు. "అందుకే వారు వ్యూహాత్మక ప్రదేశాలలో కొంతమంది విశ్వసనీయ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విభాగం మినహా వివిధ శాఖల అధికారులందరినీ బదిలీ చేసింది. ఈ విషయాన్ని బీజేపీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళుతుంది" అని బండి సంజయ్ పేర్కొన్నారు. ఎన్ని సర్వేలు వచ్చినా వచ్చే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజలు మరోసారి బీఆర్‌ఎస్‌కు అధికారం ఇస్తే రాష్ట్రానికి ఉన్న 5 లక్షల కోట్ల అప్పులను 10 లక్షల కోట్లకు పెంచుతారని ఆరోపించారు. "కాంగ్రెస్ కు వారెంటీ లేదు. దాని హామీలను ప్రజలు ఎలా నమ్ముతారు? 50 ఏళ్ల తర్వాత రాహుల్ గాంధీ పరిణతి సాధించారని వారు అంటున్నారు. అలా అనడం ద్వారా ఇన్నాళ్లూ రాహుల్ గాంధీకి తనకంటూ పరిణతి చెందిన మనస్సు లేదని ఈ కాంగ్రెస్ నేతలు అంగీకరిస్తున్నారు" అంటూ విమర్శలు గుప్పించారు.