తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : కేసీఆర్‌పై పోటీ చేస్తా .. ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు

Siva Kodati | Published : Oct 12, 2023 5:25 PM
Google News Follow Us

సారాంశం

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీ చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ .  తాను హుజురాబాద్‌తో పాటు కేసీఆర్‌పైనా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీ చేస్తానని తెలిపారు. గురువారం హుజురాబాద్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను హుజురాబాద్‌తో పాటు కేసీఆర్‌పైనా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. హుజురాబాద్‌లో కార్యకర్తలే కథనాయకులు కావాలని రాజేందర్ అన్నారు. 

కాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నే ఎదిరించి బిఆర్ఎస్ నుండి బయటకు వచ్చారు ఈటల రాజేందర్. ఈ క్రమంలో జరిగిన హుజురాబాద్ ఉపఎన్నికల సమయంలో  ఈటల జమున తెరపైకి వచ్చారు. భర్తకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనడంతో పాటు తమపై వచ్చిన అవినీతి ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేసారు. ఇలా భర్తకు మద్దతుగా తెలియకుండానే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జమున ఇప్పుడు ఫుల్ టైమ్ పాలిటీషన్ గా మారనున్నారని ప్రచారం జరుగుతోంది. బిజెపి అభ్యర్ధుల వేటలో వున్న బిజెపి జమునను కూడా ఎన్నికల బరిలో దింపాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

ALso Read : Telangana Elections 2023 : బిజెపి బిగ్ ప్లాన్... ఈటల భార్యకు ఎమ్మెల్యే టికెట్? అక్కడినుంచేనట...

హైదరాబాద్ శివారులోని మేడ్చల్ నియోజకవర్గం శామీర్ పేటలో ఈటల దంపతులు నివాసముంటున్నారు. అలాగే వీరి వ్యాపారాలు చాలావరకు ఈ నియోజకవర్గంలోనే వున్నాయి. దీంతో ఈటల కుటుంబానికి మేడ్చల్ లోని అన్నిపార్టీల నాయకులతో మంచి సంత్సంబంధాలు వున్నారు. దీంతో ఈటల జమునను మేడ్చల్ నుండి బరిలోకి దింపాలని బిజెపి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈటల రాజేందర్ రాజకీయ, అనుభవం... అంగబలం, అర్ధబలం జమునకు మరింత ప్లస్ అవుతాయని బిజెపి భావిస్తోందట. 

అలాగే మేడ్చల్ నియోజకవర్గంలో బలమైన బిజెపి నాయకులు లేకపోవడంతో జమున పేరు తెరపైకి వచ్చింది. సామాజికవర్గాల పరంగా చూసుకున్నా జమున పోటీచేయడం కలిసివస్తుందన్న భావనతో బిజెపి వుందట. ఈటల రాజేందర్ బిసి, జమున రెడ్డి సామాజికవర్గాలకు చెందినవారు కావడంతో ఈ రెండు వర్గాల ఓటర్లను కూడా ఆకర్షించవచ్చన్నది బిజెపి ఎత్తుగడగా తెలుస్తోంది. 

ఇదిలావుంటే తన భార్య జమునను రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు ఈటల రాజేందర్ కూడా సుముఖంగా వున్నట్లు తెలుస్తోంది. ఆయనే స్వయంగా తన భార్యకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని బిజెపి అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. దీంతో ఆమెను మేడ్చల్ నియోజకవర్గం నుండి పోటీ చేయించాలని బిజెపి భావిస్తోందట.
 

Read more Articles on